Neeve appadi numdi nikkevu gaani

నీవే అప్పటి నుండి నిక్కేవు గాని
Language

(॥పల్లవి॥)
నీవే అప్పటి నుండి నిక్కేవు గాని
మోవులు రెండు నెత్తక మూసుకున్న దదివొ

(॥నీవే॥)
పల్లినదే వ్రతమా పడఁతతో వాదించేవు
యెట్టకేల కన్నవట యెగ్గు సేతురా
ముట్టి వచ్చితే నాపెకు మొగమోట దరచు
వొట్టులు సత్యాల కోప కూరకున్న దదివో

(॥నీవే॥)
ఇంతితోనే పంతమా యెత్తవు వంచినతల
మంతనపుచేఁతలకే మచ్చరించేవు
యెంతనీవు రేఁచినాను ఇచ్చక మాపెగుణము
అంతేసిరట్టు కోపక అణఁగున్న దదివో

(॥నీవే॥)
చేసినదే నీకు చేఁతా చెనకే వాపెను సారె
పాసినప్పటిచందాలు పాటి సేతురా
ఆల శ్రీ వేంకటేశ ఆపె నిట్టె కూడితివి
మోసములన్నీఁ దీర మొక్కుచున్న దదివో

(||pallavi||)
nīve appaḍi nuṁḍi nikkevu gāni
movulu rĕṁḍu nĕttaga mūsugunna dadivŏ

(||nīve||)
pallinade vradamā paḍam̐tado vādiṁchevu
yĕṭṭagela kannavaḍa yĕggu sedurā
muṭṭi vachchide nābĕgu mŏgamoḍa darasu
vŏṭṭulu satyāla koba kūragunna dadivo

(||nīve||)
iṁtidone paṁtamā yĕttavu vaṁchinadala
maṁtanabusem̐talage machchariṁchevu
yĕṁtanīvu rem̐sinānu ichchaga mābĕguṇamu
aṁtesiraṭṭu kobaga aṇam̐gunna dadivo

(||nīve||)
sesinade nīgu sem̐tā sĕnage vābĕnu sārĕ
pāsinappaḍisaṁdālu pāḍi sedurā
āla śhrī veṁkaḍeśha ābĕ niṭṭĕ kūḍidivi
mosamulannīm̐ dīra mŏkkusunna dadivo