Neeve aanadiyyavayya nee seppinattu sese

నీవే ఆనతియ్యవయ్య నీ చెప్పినట్టు సేసే
Language

(॥పల్లవి॥)
నీవే ఆనతియ్యవయ్య నీ చెప్పినట్టు సేసే
భావించి రెంటికిఁ గాక భ్రమసి వుందానను

(॥నీవే॥)
కొచ్చి కొచ్చి నే నిన్నుఁ గొసరఁగఁబోతేను
రచ్చలలోని సతులు రట్టడందురు
వొచ్చెములు నిన్నెంచక వూరకే నే నుండితేను
యిచ్చకురాలు మరేమీ నెఱగదందురు

(॥నీవే॥)
జిగి నిన్ను రమ్మంటాఁ జేయివట్టి తీసితేను
మగవాని నింతసేసె మంకుదందురు
వెగటులేక నిన్ను విచ్చనవిడి సేసితే
అగపడె నిది యెంత అధమురాలందురు

(॥నీవే॥)
వేవేలుగా నీకు వినయాలు సేసితేను
చేవదేర మాయదారిచేఁత దందురు
శ్రీవేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టె
నీవురముపై నుండఁగ నీవేనందురు

(||pallavi||)
nīve ānadiyyavayya nī sĕppinaṭṭu sese
bhāviṁchi rĕṁṭigim̐ gāga bhramasi vuṁdānanu

(||nīve||)
kŏchchi kŏchchi ne ninnum̐ gŏsaram̐gam̐bodenu
rachchalaloni sadulu raṭṭaḍaṁduru
vŏchchĕmulu ninnĕṁchaga vūrage ne nuṁḍidenu
yichchagurālu maremī nĕṟagadaṁduru

(||nīve||)
jigi ninnu rammaṁṭām̐ jeyivaṭṭi tīsidenu
magavāni niṁtasesĕ maṁkudaṁduru
vĕgaḍulega ninnu vichchanaviḍi seside
agabaḍĕ nidi yĕṁta adhamurālaṁduru

(||nīve||)
vevelugā nīgu vinayālu sesidenu
sevadera māyadārisem̐ta daṁduru
śhrīveṁkaḍeśha nannum̐ jegŏni kūḍidi viṭṭĕ
nīvuramubai nuṁḍam̐ga nīvenaṁduru