Neeve aalavaidivaa neyyamuna needanigi

నీవే ఆలవైతివా నెయ్యమున నీతనికి
Language

(॥పల్లవి॥)
నీవే ఆలవైతివా నెయ్యమున నీతనికి
వావులు నేఁ జెప్పితేను వంకలొత్తేవేమే

(॥నీవే॥)
యిట్టె నాపతిమాటలు యెగ్గులు నేనెంచితేను
వట్టి చక్కట్లు చెప్పవచ్చే విదేమే
దట్టపుఁగాఁకలతోడ తప్ప కాతనిఁ జూచితే
పెట్టేవు మాటుగా జేయి బింకాన నిదేమే

(॥నీవే॥)
తగిలి యాతనిచేఁత తారుకాణసేసితేను
బిగిసి లేదని యానవెట్టే విదేమే
నగుతా నాతనిమేను నాట గోర నూఁదితేను
వగచి మందులు వెట్టవచ్చే విదేమే

(॥నీవే॥)
కందువ నాతనిమేను కాగిలించి కూడితేను
సందడి నలపార విసరే విదేమే
యిందులో శ్రీవేంకటేశుఁ డీతని నే నవ్వితే
అందుకోలు జాణతనా లాడి మెచ్చే విదేమే

(||pallavi||)
nīve ālavaidivā nĕyyamuna nīdanigi
vāvulu nem̐ jĕppidenu vaṁkalŏtteveme

(||nīve||)
yiṭṭĕ nābadimāḍalu yĕggulu nenĕṁchidenu
vaṭṭi sakkaṭlu sĕppavachche videme
daṭṭabum̐gām̐kaladoḍa tappa kādanim̐ jūside
pĕṭṭevu māḍugā jeyi biṁkāna nideme

(||nīve||)
tagili yādanisem̐ta tārugāṇasesidenu
bigisi ledani yānavĕṭṭe videme
nagudā nādanimenu nāḍa gora nūm̐didenu
vagasi maṁdulu vĕṭṭavachche videme

(||nīve||)
kaṁduva nādanimenu kāgiliṁchi kūḍidenu
saṁdaḍi nalabāra visare videme
yiṁdulo śhrīveṁkaḍeśhum̐ ḍīdani ne navvide
aṁdugolu jāṇadanā lāḍi mĕchche videme