నీవే ఆతఁడు గావా నేటిదాఁకా
(॥పల్లవి॥)
నీవే ఆతఁడు గావా నేటిదాఁకా
వావిలి నాతనిలోని వలపు చేకొనవే
(॥నీవే॥)
పంతములాడఁ జూచితే పలుకులిన్ని లేవు
చింతించఁ జూచితేను చిక్కెంత లేదు
యింతటికి సెలవు నీ యింటికి వచ్చె నాతఁడు
వింతలేక మనసుతో వేడుక చెల్లించవే
(॥నీవే॥)
వాసులెంచఁ బోతేను వక్కణ లెన్ని లేవు
పాసితేను విరహతాప మెంత లేదు
ఆసపడి విభుఁడు నీయలుక దేరిచెనేఁడు
తాసువలె సరిదూఁగి తలఁపీడేరించవే
(॥నీవే॥)
తగవులఁ బెట్టఁబోతే తప్పులెన్నేసి లేవు
చిగిరించి నవ్వఁబోతే సిగ్గెంతలేదు
అగపడి శ్రీ వేంకటాధిపతి నిన్నుఁగూడె
మొగమోడి రతులలో ముచ్చటలు చెప్పవే
(||pallavi||)
nīve ādam̐ḍu gāvā neḍidām̐kā
vāvili nādaniloni valabu segŏnave
(||nīve||)
paṁtamulāḍam̐ jūside palugulinni levu
siṁtiṁcham̐ jūsidenu sikkĕṁta ledu
yiṁtaḍigi sĕlavu nī yiṁṭigi vachchĕ nādam̐ḍu
viṁtalega manasudo veḍuga sĕlliṁchave
(||nīve||)
vāsulĕṁcham̐ bodenu vakkaṇa lĕnni levu
pāsidenu virahadāba mĕṁta ledu
āsabaḍi vibhum̐ḍu nīyaluga derisĕnem̐ḍu
tāsuvalĕ saridūm̐gi talam̐pīḍeriṁchave
(||nīve||)
tagavulam̐ bĕṭṭam̐bode tappulĕnnesi levu
sigiriṁchi navvam̐bode siggĕṁtaledu
agabaḍi śhrī veṁkaḍādhibadi ninnum̐gūḍĕ
mŏgamoḍi radulalo muchchaḍalu sĕppave