నీవనే నమ్మినయట్టి నీ వారము
(॥పల్లవి॥)
నీవనే నమ్మినయట్టి నీ వారము
వేవేలు విధాలఁ జేసే విన్నపమిదయ్యా
(॥నీవ॥)
పండెనుమాకర్మములు పాలు గోరు గొనవయ్య
అండనె నామతిలోని అంతర్యామి
నిండెనునాకోరికలు నినుపువారిధులై
వెండిబంగారాలతోడ విఱవీఁగవయ్యా
(॥నీవ॥)
మలసె మాపుట్టుగులు మారుమూలసరకులై
కలసుంకము దీరుచు కరుణాకర
వెలసె సంసారాలు వెక్కసపుఁ బౌఁజులై
తొలఁగక యిటు నీవు తోడుచూడవయ్యా
(॥నీవ॥)
కూడెను మానుతులనే గోకులపుఁ గదుపులు
యీడుగాఁ బుల్లరి గొని యేలవయ్యా
వోడక శ్రీవేంకటేశ వొప్పగించితిమి నీకు
వేడుకలు దైవార విహరించవయ్యా
(||pallavi||)
nīvane namminayaṭṭi nī vāramu
vevelu vidhālam̐ jese vinnabamidayyā
(||nīva||)
paṁḍĕnumāgarmamulu pālu goru gŏnavayya
aṁḍanĕ nāmadiloni aṁtaryāmi
niṁḍĕnunāgorigalu ninubuvāridhulai
vĕṁḍibaṁgārāladoḍa viṟavīm̐gavayyā
(||nīva||)
malasĕ mābuṭṭugulu mārumūlasaragulai
kalasuṁkamu dīrusu karuṇāgara
vĕlasĕ saṁsārālu vĕkkasabum̐ baum̐julai
tŏlam̐gaga yiḍu nīvu toḍusūḍavayyā
(||nīva||)
kūḍĕnu mānudulane gogulabum̐ gadubulu
yīḍugām̐ bullari gŏni yelavayyā
voḍaga śhrīveṁkaḍeśha vŏppagiṁchidimi nīgu
veḍugalu daivāra vihariṁchavayyā