Neevamtivaarame kaamaa nemellaa nimta sesemaa

నీవంటివారమే కామా నేమెల్లా నింత సేసేమా
Language

(॥పల్లవి॥)
నీవంటివారమే కామా నేమెల్లా నింత సేసేమా
కావరించి కడునేల గయ్యాళించేవే

(॥నీవంటి॥)
సిగ్గువడ్డదానవు శిరసు వంచుకుండఁగ
వొగ్గి పతితోనేల వొడ్డారించేవే
వెగ్గళించి ఇవీఁ గొన్నివేసాలు సేసేవుగాక
యెగ్గులేని సతులు నివి వోజలటవే

(॥నీవంటి॥)
పంతపుదానవు నీ వప్పటి గుట్టు చూపక
కాంతుని నింతేసి యేల గరిసించేవే
యెంత లేదు ఇవీఁ గొన్నియెమ్మెలు సేసేవుగాక
ఇంతలోఁ జూచినవార లిది మెత్తు రటవే

(॥నీవంటి॥)
వొట్టు వెట్టుకున్నదాన వూరకే వుండుటగాక
కిట్టి శ్రీవేంకటేశుఁ గాఁగిలింతురటే
గట్టిగా న న్నితఁ డేలె తలు చెప్పేవుగాక
యిట్టె సవతులకు నింత దగునటవే

(||pallavi||)
nīvaṁṭivārame kāmā nemĕllā niṁta sesemā
kāvariṁchi kaḍunela gayyāḽiṁcheve

(||nīvaṁṭi||)
sigguvaḍḍadānavu śhirasu vaṁchuguṁḍam̐ga
vŏggi padidonela vŏḍḍāriṁcheve
vĕggaḽiṁchi ivīm̐ gŏnnivesālu sesevugāga
yĕgguleni sadulu nivi vojalaḍave

(||nīvaṁṭi||)
paṁtabudānavu nī vappaḍi guṭṭu sūbaga
kāṁtuni niṁtesi yela garisiṁcheve
yĕṁta ledu ivīm̐ gŏnniyĕmmĕlu sesevugāga
iṁtalom̐ jūsinavāra lidi mĕttu raḍave

(||nīvaṁṭi||)
vŏṭṭu vĕṭṭugunnadāna vūrage vuṁḍuḍagāga
kiṭṭi śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁturaḍe
gaṭṭigā na nnidam̐ ḍelĕ talu sĕppevugāga
yiṭṭĕ savadulagu niṁta dagunaḍave