నీవంటివారమే కామా నే మెల్లాను
(॥పల్లవి॥)
నీవంటివారమే కామా నే మెల్లాను
పూవు వలె ముడుచుక భోగించేమటే
(॥॥)
వాసులకే పెనఁగేవు వంతులకు వచ్చేవు
వీసమంత పనికైనా వేగిరానను
సేస వెట్టిన సతులు చేరి కొలిచే రింతే
పూసవలెఁ గట్టుకొని భోగించేరటే
(॥॥)
పంతములే చూపేవు బత్తులకే లాసేవు
అంతలోనే తమకాన ఆసతోడను
మంతనపు చెలు లెల్ల మచ్చికలు సేసి రింతే
బొంత వలెఁ జట్టుక భోగించేరటే
(॥॥)
కన్నులనే యాఁకరేవు కౌఁగిటనే కూడేవు
సన్నల శ్రీ వేంకటేశుఁ జటమునను
వన్నెలతో మే మెల్లా వరుసఁ గూడితి మింతే
పున్నమ వెన్నెల వలె భోగించేరటే
(||pallavi||)
nīvaṁṭivārame kāmā ne mĕllānu
pūvu valĕ muḍusuga bhogiṁchemaḍe
(||||)
vāsulage pĕnam̐gevu vaṁtulagu vachchevu
vīsamaṁta panigainā vegirānanu
sesa vĕṭṭina sadulu seri kŏlise riṁte
pūsavalĕm̐ gaṭṭugŏni bhogiṁcheraḍe
(||||)
paṁtamule sūbevu battulage lāsevu
aṁtalone tamagāna āsadoḍanu
maṁtanabu sĕlu lĕlla machchigalu sesi riṁte
bŏṁta valĕm̐ jaṭṭuga bhogiṁcheraḍe
(||||)
kannulane yām̐karevu kaum̐giḍane kūḍevu
sannala śhrī veṁkaḍeśhum̐ jaḍamunanu
vannĕlado me mĕllā varusam̐ gūḍidi miṁte
punnama vĕnnĕla valĕ bhogiṁcheraḍe