నీవంటి చుట్టము నాకు నిండు నిధానము గాదా
(॥పల్లవి॥)
నీవంటి చుట్టము నాకు నిండు నిధానము గాదా
పూవుల నీ పాదములు పూజింతుఁ గాక
(॥నీవం॥)
చెనకి నీ వేమితప్పుచేసి వచ్చితివో నేఁడు
వినయములనే నన్ను వేఁడుకొనేవు
కినిసేనా నేనేమైనా కెలసి ఇందుకుఁగాను
చనవున నన్నిటికి సమ్మతింతుగాక
(॥నీవం॥)
తిలకించి యెవ్వతెనుఁ దెచ్చుకొంటివో నీవు
పలువిధముల నాపై బత్తి సేసేవు
నెలకొని యీ పనికి నేరమి నీపై వేసేనా
పొలసి నిన్నిందరిలోఁ బొగడుదుఁగాక
(॥నీవం॥)
పొందుల నెక్కడి తలపోఁతల నున్నాఁడవో
కందువ నన్నుఁగంటానే కాఁగిలించేవు
యెందైనా శ్రీ వేంకటేశ యెగసక్కెమాడేనా
అందపు రతుల నిన్ను నాదరింతుఁ గాక
(||pallavi||)
nīvaṁṭi suṭṭamu nāgu niṁḍu nidhānamu gādā
pūvula nī pādamulu pūjiṁtum̐ gāga
(||nīvaṁ||)
sĕnagi nī vemidappusesi vachchidivo nem̐ḍu
vinayamulane nannu vem̐ḍugŏnevu
kinisenā nenemainā kĕlasi iṁdugum̐gānu
sanavuna nanniḍigi sammadiṁtugāga
(||nīvaṁ||)
tilagiṁchi yĕvvadĕnum̐ dĕchchugŏṁṭivo nīvu
paluvidhamula nābai batti sesevu
nĕlagŏni yī panigi nerami nībai vesenā
pŏlasi ninniṁdarilom̐ bŏgaḍudum̐gāga
(||nīvaṁ||)
pŏṁdula nĕkkaḍi talabom̐tala nunnām̐ḍavo
kaṁduva nannum̐gaṁṭāne kām̐giliṁchevu
yĕṁdainā śhrī veṁkaḍeśha yĕgasakkĕmāḍenā
aṁdabu radula ninnu nādariṁtum̐ gāga