Neevamti sittame naagu niluba raadaa

నీవంటి చిత్తమె నాకు నిలుప రాదా
Language

(॥పల్లవి॥)
నీవంటి చిత్తమె నాకు నిలుప రాదా
చేవ దేర నీ యిచ్చలోఁ జెలగేనయ్యా

(॥నీవంటి॥)
సంతస మయనవేళ సారె నవ్వ వచ్చుఁ గాక
చింతించే వేళా నట్టే చేకూరునా
పంతపు నీ చేఁతలు నా భావములో నుండఁగాను
చెంత సరస మాడేవు చెల్లు నయ్య నీకు

(॥నీవంటి॥)
చెక్కు నొక్కేటట్టివేళ సేదధేర వచ్చుఁ గాక
కక్కసించేటట్టివేళ కై కొలుపునా
వెక్కసపు నీ మాటలు వింటా నే నుండఁగాను
తొక్కేవు పాదము నేకే తోఁచునయ్య యిట్టివి

(॥నీవంటి॥)
మించఁ దనిసినవేళ మే మఱవ వచ్చుఁ గాక
అంచఁ దమకపువేళ ననువు లౌనా
యెంచఁగ శ్రీవెంకటేశ యెనసితి విటు నన్ను
నించితి వేడుక లెల్ల నేర్తు వయ్య నీవు

(||pallavi||)
nīvaṁṭi sittamĕ nāgu niluba rādā
seva dera nī yichchalom̐ jĕlagenayyā

(||nīvaṁṭi||)
saṁtasa mayanaveḽa sārĕ navva vachchum̐ gāga
siṁtiṁche veḽā naṭṭe segūrunā
paṁtabu nī sem̐talu nā bhāvamulo nuṁḍam̐gānu
sĕṁta sarasa māḍevu sĕllu nayya nīgu

(||nīvaṁṭi||)
sĕkku nŏkkeḍaṭṭiveḽa sedadhera vachchum̐ gāga
kakkasiṁcheḍaṭṭiveḽa kai kŏlubunā
vĕkkasabu nī māḍalu viṁṭā ne nuṁḍam̐gānu
tŏkkevu pādamu nege tom̐sunayya yiṭṭivi

(||nīvaṁṭi||)
miṁcham̐ danisinaveḽa me maṟava vachchum̐ gāga
aṁcham̐ damagabuveḽa nanuvu launā
yĕṁcham̐ga śhrīvĕṁkaḍeśha yĕnasidi viḍu nannu
niṁchidi veḍuga lĕlla nerdu vayya nīvu