నీవంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా
(॥పల్లవి॥)
నీవంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా
ఆవలిమోమె యుందానవారడింత గలదా
(॥నీవంటి॥)
సిగ్గున నుందానవో చింతతోనుందానవో
సిగ్గుకుఁ జింతకు సాక్షి చెక్కిటిచేయే
దగ్గరి నీరమణుఁడు తమకించి పిలువఁగ
అగ్గలమయ్యేవదేమే ఆఱడింత గలదా
(॥నీవంటి॥)
మాయలు సేసేవో మంతనాననుందానవో
మాయకు మంతనానకు మంచమే సాక్షి
చేయివట్టి యాతఁడు నీచింతదీరఁ దియ్యఁగాను
ఆయాలు దాఁక దొబ్బేవు ఆఱడింత గలదా
(॥నీవంటి॥)
కరుణ నీకుఁ బుట్టెనో కాఁకలు నీకు ముంచెనో
కరుణకుఁ గాఁకలకు కాఁగిలే సాక్షి
అరుదై శ్రీ వేంకటేశుఁడట్టె నిన్నుఁ గలసెను
అరమరచేవు మేను ఆఱడింత గలదా
(||pallavi||)
nīvaṁṭi sadulado nĕyyamādam̐ḍu sūbam̐gā
āvalimomĕ yuṁdānavāraḍiṁta galadā
(||nīvaṁṭi||)
sigguna nuṁdānavo siṁtadonuṁdānavo
siggugum̐ jiṁtagu sākṣhi sĕkkiḍiseye
daggari nīramaṇum̐ḍu tamagiṁchi piluvam̐ga
aggalamayyevademe āṟaḍiṁta galadā
(||nīvaṁṭi||)
māyalu sesevo maṁtanānanuṁdānavo
māyagu maṁtanānagu maṁchame sākṣhi
seyivaṭṭi yādam̐ḍu nīsiṁtadīram̐ diyyam̐gānu
āyālu dām̐ka dŏbbevu āṟaḍiṁta galadā
(||nīvaṁṭi||)
karuṇa nīgum̐ buṭṭĕno kām̐kalu nīgu muṁchĕno
karuṇagum̐ gām̐kalagu kām̐gile sākṣhi
arudai śhrī veṁkaḍeśhum̐ḍaṭṭĕ ninnum̐ galasĕnu
aramarasevu menu āṟaḍiṁta galadā