Neevamti gumde ledu nirumohi nemgaanu

నీవంటి గుండె లేదు నిరుమోహి నేఁగాను
Language

(॥పల్లవి॥)
నీవంటి గుండె లేదు నిరుమోహి నేఁగాను
కావరించి చూచి యింకాఁ గన్నుల కాఁకారదు

(॥నీవం॥)
నిన్నుఁబాసి నాకెట్టు నిదుర వచ్చీ నేఁడు
వెన్నెలవాయిటనే వేగింతుఁగాక
నిన్న మాపటంత నే నీమీఁద సేసవెట్టి
చెన్నలర నింకాను చేతులతడారదు

(॥నీవం॥)
మాట నీతో నాడక మనసెట్టుండీరా నాకు
తూఁటనిలుతునిఁ గొంత దూరుదుఁగాక
మేఁటినై నీతో నేను మేనవావులు దెలిపి
నాఁటినమోవులలోని నవ్వులింకా మానవు

(॥నీవం॥)
మచ్చిక నిన్ను మరిగి మరపెట్టయ్యీర నాకు
అచ్చపు నీతో సరసమాడుదుఁ గాక
యిచ్చలు శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడి మేని-
పచ్చిచెమటలింకవు పైపైనే నాకు

(||pallavi||)
nīvaṁṭi guṁḍĕ ledu nirumohi nem̐gānu
kāvariṁchi sūsi yiṁkām̐ gannula kām̐kāradu

(||nīvaṁ||)
ninnum̐bāsi nāgĕṭṭu nidura vachchī nem̐ḍu
vĕnnĕlavāyiḍane vegiṁtum̐gāga
ninna mābaḍaṁta ne nīmīm̐da sesavĕṭṭi
sĕnnalara niṁkānu seduladaḍāradu

(||nīvaṁ||)
māḍa nīdo nāḍaga manasĕṭṭuṁḍīrā nāgu
tūm̐ṭaniludunim̐ gŏṁta dūrudum̐gāga
mem̐ṭinai nīdo nenu menavāvulu dĕlibi
nām̐ṭinamovulaloni navvuliṁkā mānavu

(||nīvaṁ||)
machchiga ninnu marigi marabĕṭṭayyīra nāgu
achchabu nīdo sarasamāḍudum̐ gāga
yichchalu śhrīveṁkaḍeśha yiddaramum̐ gūḍi meni-
pachchisĕmaḍaliṁkavu paibaine nāgu