Neevamka neramede nijamemchi soosidenu

నీవంక నేరమేదే నిజమెంచి చూచితేను
Language

(॥పల్లవి॥)
నీవంక నేరమేదే నిజమెంచి చూచితేను
పూవుల మొగ్గలే కావా పూఁపలకు మొదలు

(॥నీ వంక॥)
పడఁతిరో నీ వదేమే పట్టాడే వాతనికిఁగా
యెడమాట లాడఁబోయి యెనసితివా
నడుమ విందారగించే నాలిక యటుండఁగాను
తొడికే చేయేకాదా తొలుతఁ బైకొనును

(॥నీ వంక॥)
మానిని అదేమే వాని మంకులు చెల్లఁబెట్టేవు
కానుక లియ్యఁగఁబోఇ కలసితివా
మానలేక వలచిన మనసట్టే వుండఁగాను
కోనల చూపులే కావా గురి గాఁడి పారును

(॥నీ వంక॥)
శ్రీ వేంకటేశ్వరు నన్నుఁ జేకొని కూడించితివి
నీ వొళ్లికడమ నిండ నెలకొంటివా
కైవశపు మేనికిని కాఁగిలి యటుండఁగాను
రావాడే చన్నులే కావా రతికెక్కు నడుమ

(||pallavi||)
nīvaṁka neramede nijamĕṁchi sūsidenu
pūvula mŏggale kāvā pūm̐palagu mŏdalu

(||nī vaṁka||)
paḍam̐tiro nī vademe paṭṭāḍe vādanigim̐gā
yĕḍamāḍa lāḍam̐boyi yĕnasidivā
naḍuma viṁdāragiṁche nāliga yaḍuṁḍam̐gānu
tŏḍige seyegādā tŏludam̐ baigŏnunu

(||nī vaṁka||)
mānini ademe vāni maṁkulu sĕllam̐bĕṭṭevu
kānuga liyyam̐gam̐boi kalasidivā
mānalega valasina manasaṭṭe vuṁḍam̐gānu
konala sūbule kāvā guri gām̐ḍi pārunu

(||nī vaṁka||)
śhrī veṁkaḍeśhvaru nannum̐ jegŏni kūḍiṁchidivi
nī vŏḽligaḍama niṁḍa nĕlagŏṁṭivā
kaivaśhabu menigini kām̐gili yaḍuṁḍam̐gānu
rāvāḍe sannule kāvā radigĕkku naḍuma