Neevamka dosamu ledu nemdaabe vamkane kaaga

నీవంక దోసము లేదు నేఁడాపె వంకనే కాక
Language

(॥పల్లవి॥)
నీవంక దోసము లేదు నేఁడాపె వంకనే కాక
రావయ్య నీవేల ఆవలిమో మయ్యేవు

(॥నీవంక॥)
నెలఁత నీతో నవ్వితే నీవూ నవ్వితివి గాక
తలకొని నీవంకఁ దప్పులున్నవా
వలపు లాపె చల్లగా వలచితి వింతే కాక
బలిమి నంతక తొల్లి పైకొంటివా

(॥నీవంక॥)
ఆకెవిడె మియ్యఁగాను అందుకొంటి వింతే కాక
కాకుసేయ నీవంకఁ గడమున్నదా
నీకు మొక్కగాఁ గాఁగిట నించుకొంటివి గాక
దాకొని రతికి నీవు తమకించితివా

(॥నీవంక॥)
సంగతిఁ బండుండఁగాను సతిఁ గూడితివి కాక
చెంగట నిన్ను దూరి చెప్పనున్నదా
రంగుగ నేనలమేలుమంగను శ్రీవేంకటేశ
సంగతిగాఁ గూడితివి జాగులు సేసితివా

(||pallavi||)
nīvaṁka dosamu ledu nem̐ḍābĕ vaṁkane kāga
rāvayya nīvela āvalimo mayyevu

(||nīvaṁka||)
nĕlam̐ta nīdo navvide nīvū navvidivi gāga
talagŏni nīvaṁkam̐ dappulunnavā
valabu lābĕ sallagā valasidi viṁte kāga
balimi naṁtaga tŏlli paigŏṁṭivā

(||nīvaṁka||)
āgĕviḍĕ miyyam̐gānu aṁdugŏṁṭi viṁte kāga
kāguseya nīvaṁkam̐ gaḍamunnadā
nīgu mŏkkagām̐ gām̐giḍa niṁchugŏṁṭivi gāga
dāgŏni radigi nīvu tamagiṁchidivā

(||nīvaṁka||)
saṁgadim̐ baṁḍuṁḍam̐gānu sadim̐ gūḍidivi kāga
sĕṁgaḍa ninnu dūri sĕppanunnadā
raṁguga nenalamelumaṁganu śhrīveṁkaḍeśha
saṁgadigām̐ gūḍidivi jāgulu sesidivā