నీవల్లనే యింత నేరుపరియాయ నాపె
(॥పల్లవి॥)
నీవల్లనే యింత నేరుపరియాయ నాపె
వేవేలు పగటులను వెలయఁగవలదా
(॥నీవ॥)
కన్నులనే నవ్వుదువు కాఁకతోఁ గొలుపులోన
సన్నలెల్లాఁ జేతువు సారెసారెకు
ఇన్నిటాను మందెమేళ మింత సేసుకొంటివి
పన్ని వుద్దండాన నిన్నుఁ బలుకఁగవలదా
(॥నీవ॥)
వేడుకతో విందువు విన్నపా లాపెచేత
ఆడుదువు సరసము లంటిముట్టి
పాడితో నీవే యాపె పంతములెక్కించితివి
జోడై నీకు రాజసాలు చూపఁగవలదా
(॥నీవ॥)
వూరకే పొగడుదువు వొకటొకటే యాపెను
చేరి కాఁగిలింతువు శ్రీవేంకటేశ
గారవపురతులనే కరకుపరచితివి
కోరి నన్నేలితి వాపెఁ గొసరఁగవలదా
(||pallavi||)
nīvallane yiṁta nerubariyāya nābĕ
vevelu pagaḍulanu vĕlayam̐gavaladā
(||nīva||)
kannulane navvuduvu kām̐kadom̐ gŏlubulona
sannalĕllām̐ jeduvu sārĕsārĕgu
inniḍānu maṁdĕmeḽa miṁta sesugŏṁṭivi
panni vuddaṁḍāna ninnum̐ balugam̐gavaladā
(||nīva||)
veḍugado viṁduvu vinnabā lābĕseda
āḍuduvu sarasamu laṁṭimuṭṭi
pāḍido nīve yābĕ paṁtamulĕkkiṁchidivi
joḍai nīgu rājasālu sūbam̐gavaladā
(||nīva||)
vūrage pŏgaḍuduvu vŏgaḍŏgaḍe yābĕnu
seri kām̐giliṁtuvu śhrīveṁkaḍeśha
gāravaburadulane karagubarasidivi
kori nannelidi vābĕm̐ gŏsaram̐gavaladā