Neevallane vachchem gaaga nem dimtesi panulu

నీవల్లనే వచ్చెఁ గాక నేఁ డింతేసి పనులు
Language

(॥పల్లవి॥)
నీవల్లనే వచ్చెఁ గాక నేఁ డింతేసి పనులు
పూవువలె నూరకుంటే పోరువెట్ట వచ్చేనా

(॥నీవ॥)
యియ్యరాని మాట నాకు నిచ్చితివి గనక నీఁ
వెయ్యడ నుంటివనంటి నిందాఁకాను
అయ్యయ్యో నీయిచ్చ నీవు అట్టే వుండితేఁ గనక
కయ్య మడువఁగ నీతోఁ గారణము గలదా

(॥నీవ॥)
అక్కడ నెవ్వతె నొల్ల ననుకొందువు గనక
చెక్కు రేక లేడవని చెప్పితి నింతే
చక్కని కొయ్యతనాల సహజాన నీవుంటే
కక్కసించి రట్టు సేయఁ గారణము గలదా

(॥నీవ॥)
ముందే నాపై మోహము మోపు గట్టుదువు గాన
చెంది వేరొకతె పొందు సేయనీనైతి
కందువ శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
కందు గుందు నిఁకనేల కారణము గలదా

(||pallavi||)
nīvallane vachchĕm̐ gāga nem̐ ḍiṁtesi panulu
pūvuvalĕ nūraguṁṭe poruvĕṭṭa vachchenā

(||nīva||)
yiyyarāni māḍa nāgu nichchidivi ganaga nīm̐
vĕyyaḍa nuṁṭivanaṁṭi niṁdām̐kānu
ayyayyo nīyichcha nīvu aṭṭe vuṁḍidem̐ ganaga
kayya maḍuvam̐ga nīdom̐ gāraṇamu galadā

(||nīva||)
akkaḍa nĕvvadĕ nŏlla nanugŏṁduvu ganaga
sĕkku rega leḍavani sĕppidi niṁte
sakkani kŏyyadanāla sahajāna nīvuṁṭe
kakkasiṁchi raṭṭu seyam̐ gāraṇamu galadā

(||nīva||)
muṁde nābai mohamu mobu gaṭṭuduvu gāna
sĕṁdi verŏgadĕ pŏṁdu seyanīnaidi
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi nannu
kaṁdu guṁdu nim̐kanela kāraṇamu galadā