Neevallane vachche nivi nerami yaabegu nedi

నీవల్లనే వచ్చె నివి నేరమి యాపెకు నేది
Language

(॥పల్లవి॥)
నీవల్లనే వచ్చె నివి నేరమి యాపెకు నేది
వేవేగ నింక నయినా వేఁడుకో నీ విపుడూ

(॥నీవల్ల॥)
ఆకెతోడ మాటాడితి వంటానే పో, యింతి
దాకతోడఁ గంకణానఁ దాకచేసెను
మేకొని ఆపెసొమ్ము నీ మేన నుండఁగానే పో
కాకుసేసి వద్ద నున్న కాంతలతోఁ దిట్టెను

(॥నీవల్ల॥)
నగరానివారితోడ నవ్వితి నంటానే పో
పగదేర రొమ్ము దట్టి పంతమాడెను
అగడుఁ జెమట చూచి అంటుకొనే వంటానే పో
వెగటుఁ దామెరఁ గొని విసరె ని న్నిచటా

(॥నీవల్ల॥)
చెనకి యెందో సన్నసేసితి వంటానే పో
వొనరి పైకొని నీకు నొట్టు వెట్టెను
యెనసితివి శ్రీవేంకటేశ బలిమి నింతలో
అనుమాన మెల్లాఁ బాయ నందుకే తా మెచ్చెను

(||pallavi||)
nīvallane vachchĕ nivi nerami yābĕgu nedi
vevega niṁka nayinā vem̐ḍugo nī vibuḍū

(||nīvalla||)
āgĕdoḍa māḍāḍidi vaṁṭāne po, yiṁti
dāgadoḍam̐ gaṁkaṇānam̐ dāgasesĕnu
megŏni ābĕsŏmmu nī mena nuṁḍam̐gāne po
kāgusesi vadda nunna kāṁtaladom̐ diṭṭĕnu

(||nīvalla||)
nagarānivāridoḍa navvidi naṁṭāne po
pagadera rŏmmu daṭṭi paṁtamāḍĕnu
agaḍum̐ jĕmaḍa sūsi aṁṭugŏne vaṁṭāne po
vĕgaḍum̐ dāmĕram̐ gŏni visarĕ ni nnisaḍā

(||nīvalla||)
sĕnagi yĕṁdo sannasesidi vaṁṭāne po
vŏnari paigŏni nīgu nŏṭṭu vĕṭṭĕnu
yĕnasidivi śhrīveṁkaḍeśha balimi niṁtalo
anumāna mĕllām̐ bāya naṁduge tā mĕchchĕnu