Neevallane kamtime nemdu yee kottalellaanu

నీవల్లనే కంటిమే నేఁడు యీ కొత్తలెల్లాను
Language

(॥పల్లవి॥)
నీవల్లనే కంటిమే నేఁడు యీ కొత్తలెల్లాను
భావించుక పైకొనేటి పడఁతియుఁ గలదా

(॥నీవల్ల॥)
మగఁడు నాలుఁ గూడి మంతనము లాడేవేళ
యెగసక్కేలకు తొంగి యేల చూచేవే
సొగిసి మరుతంత్రానఁ జొక్కివుండేటివారి
నగడు సేసేయట్టి ఆఁటదియుఁ గలదా

(॥నీవల్ల॥)
కందువఁ దామిద్దరును కాఁగిలించొన్నవేళ
గొంది నీవు వ్దద నేల కూచుండేవే
పొంది పానుపుమీఁద భోగించేయట్టివారి
అంది సిగ్గువరచేటి అతివయు గలదా

(॥నీవల్ల॥)
అట్టె శ్రీవేంకటేశుఁ డలమేల్మంగఁ గూడఁగ
గుట్టునఁ జన్నుల నెంత గుచ్చియెత్తేవే
తొట్టుకొని మోవులవిందులు చివిచూచేవారి
నెట్టనఁ బచ్చిసేసేటి నెలఁతయుఁ గలదా

(||pallavi||)
nīvallane kaṁṭime nem̐ḍu yī kŏttalĕllānu
bhāviṁchuga paigŏneḍi paḍam̐tiyum̐ galadā

(||nīvalla||)
magam̐ḍu nālum̐ gūḍi maṁtanamu lāḍeveḽa
yĕgasakkelagu tŏṁgi yela sūseve
sŏgisi marudaṁtrānam̐ jŏkkivuṁḍeḍivāri
nagaḍu seseyaṭṭi ām̐ṭadiyum̐ galadā

(||nīvalla||)
kaṁduvam̐ dāmiddarunu kām̐giliṁchŏnnaveḽa
gŏṁdi nīvu vdada nela kūsuṁḍeve
pŏṁdi pānubumīm̐da bhogiṁcheyaṭṭivāri
aṁdi sigguvaraseḍi adivayu galadā

(||nīvalla||)
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgam̐ gūḍam̐ga
guṭṭunam̐ jannula nĕṁta guchchiyĕtteve
tŏṭṭugŏni movulaviṁdulu sivisūsevāri
nĕṭṭanam̐ bachchiseseḍi nĕlam̐tayum̐ galadā