నీవల్లనైన పని నీ మీఁదనే మోచుఁగాక
(॥పల్లవి॥)
నీవల్లనైన పని నీ మీఁదనే మోచుఁగాక
యే వెరవు నెరఁగము యేమి సేతురా
(॥నీవ॥)
నిన్నుఁజూచి లోనను నిద్దిరించఁబోతేను
వెన్నాడి నీరూపము నావెంట వచ్చేను
కన్ను మూసినాఁ బోదు కాఁగిటికి లోనుగాదు
యిన్నిటా నిన్ను దూరక యేమి సేతురా
(॥నీవ॥)
చేరి నీతో మాటలాడి చెలితో మాటలాడితే
దూరి నీపేరే నానోరఁ దొరలీని
వూరకున్నఁ బోదు పొందు లొనరీంచఁదా రాదు
యీరీతి నిన్నుఁదగుల కేమి సేతురా
(॥నీవ॥)
యిట్టె నీవద్దఁ బండుండి యీవలి మోమైతేను
తట్టి నీమేను నన్నింటి తమి రేఁచీని
గట్టిగ శ్రీవేంకటేశ కలసితి వింతలోనే
యిట్టె నీ చేఁతలు మెచ్చ కేమి సేతురా
(||pallavi||)
nīvallanaina pani nī mīm̐dane mosum̐gāga
ye vĕravu nĕram̐gamu yemi sedurā
(||nīva||)
ninnum̐jūsi lonanu niddiriṁcham̐bodenu
vĕnnāḍi nīrūbamu nāvĕṁṭa vachchenu
kannu mūsinām̐ bodu kām̐giḍigi lonugādu
yinniḍā ninnu dūraga yemi sedurā
(||nīva||)
seri nīdo māḍalāḍi sĕlido māḍalāḍide
dūri nībere nānoram̐ dŏralīni
vūragunnam̐ bodu pŏṁdu lŏnarīṁcham̐dā rādu
yīrīdi ninnum̐dagula kemi sedurā
(||nīva||)
yiṭṭĕ nīvaddam̐ baṁḍuṁḍi yīvali momaidenu
taṭṭi nīmenu nanniṁṭi tami rem̐sīni
gaṭṭiga śhrīveṁkaḍeśha kalasidi viṁtalone
yiṭṭĕ nī sem̐talu mĕchcha kemi sedurā