Neevallam gadama gaddaa nene yaasagimchemgaaga

నీవల్లఁ గడమ గద్దా నేనే యాసగించేఁగాక
Language

(॥పల్లవి॥)
నీవల్లఁ గడమ గద్దా నేనే యాసగించేఁగాక
భావ మొక్కటేకాదా పంతమాడేఁగాక

(॥నీవల్లఁ॥)
యెఱఁగనా నీవు నాపై నిటుగల మోహము
గుఱిగా మఱచి ఇఁకఁ గొసరేఁగాక
మఱి కరఁగనా నీమంతనపు కాఁగిటిలో
జఱసి తనియ కిట్టె జలకించేఁ గాక

(॥నీవల్లఁ॥)
ఇయ్యకొననా నీవు ఇచ్చినచనువులెల్లా
తియ్యనిసిగ్గున నేనే తిట్టితిఁగాక
నెయ్యపు నీగుణమెల్లా నేఁగన్నదేకాదా
పయ్యదజారినందుకే పదరితిఁగాక

(॥నీవల్లఁ॥)
విననా నీవాడినట్టివినయపు మాటలెల్లా
ననుపుమందెమేళాన నగితిఁగాక
యెనయఁగ శ్రీవేంకటేశ నేనూఁ గూడనా
పెనఁగేయందుకే నేను ప్రియపడేఁగాక

(||pallavi||)
nīvallam̐ gaḍama gaddā nene yāsagiṁchem̐gāga
bhāva mŏkkaḍegādā paṁtamāḍem̐gāga

(||nīvallam̐||)
yĕṟam̐ganā nīvu nābai niḍugala mohamu
guṟigā maṟasi im̐kam̐ gŏsarem̐gāga
maṟi karam̐ganā nīmaṁtanabu kām̐giḍilo
jaṟasi taniya kiṭṭĕ jalagiṁchem̐ gāga

(||nīvallam̐||)
iyyagŏnanā nīvu ichchinasanuvulĕllā
tiyyanisigguna nene tiṭṭidim̐gāga
nĕyyabu nīguṇamĕllā nem̐gannadegādā
payyadajārinaṁduge padaridim̐gāga

(||nīvallam̐||)
vinanā nīvāḍinaṭṭivinayabu māḍalĕllā
nanubumaṁdĕmeḽāna nagidim̐gāga
yĕnayam̐ga śhrīveṁkaḍeśha nenūm̐ gūḍanā
pĕnam̐geyaṁduge nenu priyabaḍem̐gāga