నీవల్ల వచ్చినమేలు నిన్ను సోఁకును
(॥పల్లవి॥)
నీవల్ల వచ్చినమేలు నిన్ను సోఁకును
దేవర నీ జగడాలు దిద్దవయ్య నీవే
(॥నీవ॥)
మచ్చరించి సవతులు మాటలాడదొరకొంటే
నిచ్చలపు వెంగేలెల్ల నిన్ను మోచును
కొచ్చి కడకన్నులకు కోపపుటెఱ్ఱ వచ్చితే
కచ్చుపెట్టి నీపైఁ దారి కమ్ముకొనును
(॥నీవ॥)
చిమ్మిరేఁగి ఆపోనాపెఁ జేతులు చాఁచంబోతే
నెమ్మది నడుమనున్ననిన్ను మోచును
వుమ్మడిపంతాలు వొక్క రొక్క రాడుకొంటేను
పమ్మి అవి దిద్ద నీపాల నుండును
(॥నీవ॥)
మించినయాకాంతలకు మేనులు చెమరించితే
పంచల నాచెమట నీపై నంటును
యెంచఁగ శ్రీవేంకంటేశ ఇద్దరినిఁ గూడితివి
కంచపు మోపుల చవి కానవచ్చు నీకును
(||pallavi||)
nīvalla vachchinamelu ninnu som̐kunu
devara nī jagaḍālu diddavayya nīve
(||nīva||)
machchariṁchi savadulu māḍalāḍadŏragŏṁṭe
nichchalabu vĕṁgelĕlla ninnu mosunu
kŏchchi kaḍagannulagu kobabuḍĕṭra vachchide
kachchubĕṭṭi nībaim̐ dāri kammugŏnunu
(||nīva||)
simmirem̐gi ābonābĕm̐ jedulu sām̐saṁbode
nĕmmadi naḍumanunnaninnu mosunu
vummaḍibaṁtālu vŏkka rŏkka rāḍugŏṁṭenu
pammi avi didda nībāla nuṁḍunu
(||nīva||)
miṁchinayāgāṁtalagu menulu sĕmariṁchide
paṁchala nāsĕmaḍa nībai naṁṭunu
yĕṁcham̐ga śhrīveṁkaṁṭeśha iddarinim̐ gūḍidivi
kaṁchabu mobula savi kānavachchu nīgunu