నీవల్ల వచ్చినమేలు నీకే తెలుసును
(॥పల్లవి॥)
నీవల్ల వచ్చినమేలు నీకే తెలుసును
ఆవటించి నేను వినే నానతీవయ్యా
(॥నీవ॥)
తక్కక నిన్ను నిట్టె తప్పకచూచితేను
చెక్కునఁజేయివెట్టుక సిగ్గువడేవు
చక్కని నీమేనికిమచ్చములేమైనా వచ్చెనో
అక్కరతో నే నెఱఁగ నానతీయవయ్యా
(॥నీవ॥)
నెయ్యముతోడుత విట్టె నీమీఁదఁ జేయివేసితే
వొయ్యనే చేతులెత్తి వొడ్డుకొనేవు
నెయ్యాన మరుముద్రలు నెలఁతలెల్లా నించిరో
ఆయ్యెడఁగలసుద్దులు ఆనతీవయ్యా
(॥నీవ॥)
ముచ్చట శ్రీవేంకటేశ మోవితేనె లడిగితే
రచ్చల నవ్వుతాను శిరసువంచేవు
యెచ్చరి నన్నుఁ గూడితి వింకా నేమిదలఁచేవో
అచ్చలాన నాకిట్టె ఆనతీవయ్యా
(||pallavi||)
nīvalla vachchinamelu nīge tĕlusunu
āvaḍiṁchi nenu vine nānadīvayyā
(||nīva||)
takkaga ninnu niṭṭĕ tappagasūsidenu
sĕkkunam̐jeyivĕṭṭuga sigguvaḍevu
sakkani nīmenigimachchamulemainā vachchĕno
akkarado ne nĕṟam̐ga nānadīyavayyā
(||nīva||)
nĕyyamudoḍuda viṭṭĕ nīmīm̐dam̐ jeyiveside
vŏyyane sedulĕtti vŏḍḍugŏnevu
nĕyyāna marumudralu nĕlam̐talĕllā niṁchiro
āyyĕḍam̐galasuddulu ānadīvayyā
(||nīva||)
muchchaḍa śhrīveṁkaḍeśha movidenĕ laḍigide
rachchala navvudānu śhirasuvaṁchevu
yĕchchari nannum̐ gūḍidi viṁkā nemidalam̐sevo
achchalāna nāgiṭṭĕ ānadīvayyā