Neevalla nemainaanu nerusulu galavo

నీవల్ల నేమైనాను నెరుసులు గలవో
Language

(॥పల్లవి॥)
నీవల్ల నేమైనాను నెరుసులు గలవో
వేవేలు నీ చందాలకు వెరగయ్యీ మాకు

(॥నీవ॥)
బత్తితోడ నాపె నీకు పచ్చడము గప్పితేను
చిత్తగించి నవ్వనేల చిఱునవ్వును
కొత్తఁగాఁ బూవులు దెచ్చి కొప్పు నీకుఁబెట్టితేను
హత్తి తప్పక చూచేవు అది యేమి యాకెను

(॥నీవ॥)
అట్టె నీవద్దనుఁడినయద్దము చూడుమంటేను
చిట్టంటుఁదనాల నీకు సిగ్గులేఁటికి
గుట్టున సింగారాలు కొచ్చి కొచ్చి మెచ్చితేను
నట్టనడుమనేల ఆనలు వెట్టుకొనేవు

(॥నీవ॥)
చేరి చేరి నీమేని చెమట దుడిచితేను
గారవిం చెంతలోనెంత కాఁగిలించేవు
యారీతి శ్రీవేంకటేశ ఇద్దరునుఁ గూడితిరి
కూరిములు సారెనేమి గొసరేవు చెలిని

(||pallavi||)
nīvalla nemainānu nĕrusulu galavo
vevelu nī saṁdālagu vĕragayyī māgu

(||nīva||)
battidoḍa nābĕ nīgu pachchaḍamu gappidenu
sittagiṁchi navvanela siṟunavvunu
kŏttam̐gām̐ būvulu dĕchchi kŏppu nīgum̐bĕṭṭidenu
hatti tappaga sūsevu adi yemi yāgĕnu

(||nīva||)
aṭṭĕ nīvaddanum̐ḍinayaddamu sūḍumaṁṭenu
siṭṭaṁṭum̐danāla nīgu siggulem̐ṭigi
guṭṭuna siṁgārālu kŏchchi kŏchchi mĕchchidenu
naṭṭanaḍumanela ānalu vĕṭṭugŏnevu

(||nīva||)
seri seri nīmeni sĕmaḍa duḍisidenu
gāraviṁ sĕṁtalonĕṁta kām̐giliṁchevu
yārīdi śhrīveṁkaḍeśha iddarunum̐ gūḍidiri
kūrimulu sārĕnemi gŏsarevu sĕlini