నీవల్ల దోసములేదు నీ వటువంటివాఁడవా
(॥పల్లవి॥)
నీవల్ల దోసములేదు నీ వటువంటివాఁడవా
రావయ్య మా యింటికి రవ్వసేయ నిన్నును
(॥నీవ॥)
వెక్కసిన నాపె నిన్ను విరుల వేయఁగాను
నిక్కి చూచితివి గాక నీ నేరమేమి
చక్క(క్కె?)రమోవి చూపి సన్నలుసేయఁగాను
చొక్కిన యందుకు నిన్ను సొలయఁగనేఁటికి
(॥నీవ॥)
చయ్యన నాపె వచ్చి చన్నులు దాఁకించఁగాను
ఇయ్యకొంటివిఁగాక నీవేమిసేతువు
వొయ్యనే పిలిచి నిన్ను నొడివట్టి తియ్యఁగాను
నెయ్యానఁ గూడినందుకు నిన్ను దూరనేఁటికి
(॥నీవ॥)
కలికి తనాల నాపె కాఁగిలించుకొనఁగాను
కలసితి వింతేకాక కాతరీఁడవా
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
యెలయింపు సుద్దు లవి యెంచఁగ నేఁటికి
(||pallavi||)
nīvalla dosamuledu nī vaḍuvaṁṭivām̐ḍavā
rāvayya mā yiṁṭigi ravvaseya ninnunu
(||nīva||)
vĕkkasina nābĕ ninnu virula veyam̐gānu
nikki sūsidivi gāga nī neramemi
sakka(kkĕ?)ramovi sūbi sannaluseyam̐gānu
sŏkkina yaṁdugu ninnu sŏlayam̐ganem̐ṭigi
(||nīva||)
sayyana nābĕ vachchi sannulu dām̐kiṁcham̐gānu
iyyagŏṁṭivim̐gāga nīvemiseduvu
vŏyyane pilisi ninnu nŏḍivaṭṭi tiyyam̐gānu
nĕyyānam̐ gūḍinaṁdugu ninnu dūranem̐ṭigi
(||nīva||)
kaligi tanāla nābĕ kām̐giliṁchugŏnam̐gānu
kalasidi viṁtegāga kādarīm̐ḍavā
yĕlami śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
yĕlayiṁpu suddu lavi yĕṁcham̐ga nem̐ṭigi