Neevalla dosamu ledu neramu naavolli dimte

నీవల్ల దోసము లేదు నేరము నావొళ్లి దింతే
Language

(॥పల్లవి॥)
నీవల్ల దోసము లేదు నేరము నావొళ్లి దింతే
చేవ దేర నిఁక నీవు సేసినంతాఁ జెల్లురా

(॥నీవల్ల॥)
కొరి నిన్నుఁ జూచి చూచి కోపగించఁ జాలఁగాని
చేర నీవు రానందుకు చిమిడీరా నా మనసు
వోరి నీవు సేసినందు కొల్లక వుండే నంటే
భారపు నాజవ్వనము పై తరవు వెట్టురా

(॥నీవల్ల॥)
దీకొని నీ పట్టుకు నేఁ దెగఁ జాలకుందుఁ గాని
కాకరి నీ నవ్వు లెల్లాఁ గాఁడిపారె నన్నునూ
వాకున వెళ్లనా డైనా వడిఁ దీర్చుకొనే నంటే
యీకడ నా మొగమాట మింత సేసె నన్నును

(॥నీవల్ల॥)
కాఁగిలించి నిన్ను నంత కస్తి నేయ నోపఁ గాని
రాగిన నా వలపులు రాసు లై వున్నవిరా
వీఁగక శ్రీవెంకటవిభుఁడ కూడితి నన్ను
మాఁగి నీ కెమ్మోవి మరిగించెఁ దీపులు

(||pallavi||)
nīvalla dosamu ledu neramu nāvŏḽli diṁte
seva dera nim̐ka nīvu sesinaṁtām̐ jĕllurā

(||nīvalla||)
kŏri ninnum̐ jūsi sūsi kobagiṁcham̐ jālam̐gāni
sera nīvu rānaṁdugu simiḍīrā nā manasu
vori nīvu sesinaṁdu kŏllaga vuṁḍe naṁṭe
bhārabu nājavvanamu pai taravu vĕṭṭurā

(||nīvalla||)
dīgŏni nī paṭṭugu nem̐ dĕgam̐ jālaguṁdum̐ gāni
kāgari nī navvu lĕllām̐ gām̐ḍibārĕ nannunū
vāguna vĕḽlanā ḍainā vaḍim̐ dīrsugŏne naṁṭe
yīgaḍa nā mŏgamāḍa miṁta sesĕ nannunu

(||nīvalla||)
kām̐giliṁchi ninnu naṁta kasti neya nobam̐ gāni
rāgina nā valabulu rāsu lai vunnavirā
vīm̐gaga śhrīvĕṁkaḍavibhum̐ḍa kūḍidi nannu
mām̐gi nī kĕmmovi marigiṁchĕm̐ dībulu