Neevalenum gosaramga nerudumaa

నీవలెనుఁ గొసరఁగ నేరుతుమా
Language

(॥పల్లవి॥)
నీవలెనుఁ గొసరఁగ నేరుతుమా
సేవలు చేసి నిన్నుఁ జేకొందుఁ గాక

(॥॥)
వెలలేనివలపుల వేడుక కాఁడవు
చలమరిచేఁతలజాజరకాఁడవు
పలుకులఁ గరిగించేబయకారివాఁడవు
నిలువుఁ జక్కఁదనాల నీటుకాఁడవు

(॥॥)
తచ్చనతరితీపులతగవరివాఁడవు
పచ్చలాయకట్టేలాబపువాఁడవు
లచ్చిగొండితనములలాగవేగకాఁడవు
విచ్చనవిడి తగులువిరికాఁడవు

(॥॥)
చొప్పులెత్తి సోదించేసుంకరివాఁడవు
కుప్పళించి పొందు సే సేకోడెకాఁడవు
ఇప్పుడె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తొప్పఁదోగేరతులకు దొమ్మికాఁడవు

(||pallavi||)
nīvalĕnum̐ gŏsaram̐ga nerudumā
sevalu sesi ninnum̐ jegŏṁdum̐ gāga

(||||)
vĕlalenivalabula veḍuga kām̐ḍavu
salamarisem̐talajājaragām̐ḍavu
palugulam̐ garigiṁchebayagārivām̐ḍavu
niluvum̐ jakkam̐danāla nīḍugām̐ḍavu

(||||)
tachchanadaridībuladagavarivām̐ḍavu
pachchalāyagaṭṭelābabuvām̐ḍavu
lachchigŏṁḍidanamulalāgavegagām̐ḍavu
vichchanaviḍi taguluvirigām̐ḍavu

(||||)
sŏppulĕtti sodiṁchesuṁkarivām̐ḍavu
kuppaḽiṁchi pŏṁdu se segoḍĕgām̐ḍavu
ippuḍĕ śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
tŏppam̐dogeradulagu dŏmmigām̐ḍavu