Neevalenimta garvimchanerane nenu

నీవలెనింత గర్వించనేరనే నేను
Language

(॥పల్లవి॥)
నీవలెనింత గర్వించనేరనే నేను
యీవలనావలఁ దానే యిందు కేమిసేసేవే

(॥నీవలె॥)
ఉద్దండాన నిన్నాతఁడు వొడివట్టి తీసెనంటా
పెద్దరిక మెందాఁకఁ జెప్పేవే నీవు
వొద్దికతో నాకైతే వుంగర మిచ్చినాఁడు
యిద్దరము నిద్దరమే యిందుకేమి సేసేవే

(॥నీవలె॥)
జక్కవ కుచాలమీఁద చందురుల నించెనంటా
చొక్కుచుఁ జెలులకేల చూపేవే నీవు
అక్కరతో నాకైతే అచ్చువేసి యేలినాఁడు
యెక్కుడు మన పంతాలు యిందుకేమి సేసేవే

(॥నీవలె॥)
కప్పి నిన్నునింతలోనే కౌఁగలించుకొనెనంటా
చిప్పిలుఁ జెమటలనేల చిమ్మిరేఁగేవే
వొప్పుగ యీ శ్రీ వేంకటోత్తముఁడు నన్నుఁగూడె
యెప్పుడు మనసొక్కటే యిందుకేమి సేసేవే

(||pallavi||)
nīvalĕniṁta garviṁchanerane nenu
yīvalanāvalam̐ dāne yiṁdu kemiseseve

(||nīvalĕ||)
uddaṁḍāna ninnādam̐ḍu vŏḍivaṭṭi tīsĕnaṁṭā
pĕddariga mĕṁdām̐kam̐ jĕppeve nīvu
vŏddigado nāgaide vuṁgara michchinām̐ḍu
yiddaramu niddarame yiṁdugemi seseve

(||nīvalĕ||)
jakkava kusālamīm̐da saṁdurula niṁchĕnaṁṭā
sŏkkusum̐ jĕlulagela sūbeve nīvu
akkarado nāgaide achchuvesi yelinām̐ḍu
yĕkkuḍu mana paṁtālu yiṁdugemi seseve

(||nīvalĕ||)
kappi ninnuniṁtalone kaum̐galiṁchugŏnĕnaṁṭā
sippilum̐ jĕmaḍalanela simmirem̐geve
vŏppuga yī śhrī veṁkaḍottamum̐ḍu nannum̐gūḍĕ
yĕppuḍu manasŏkkaḍe yiṁdugemi seseve