నీవైనాఁ జేరఁగవచ్చి నేరుపవయ్య చేఁతలు
(॥పల్లవి॥)
నీవైనాఁ జేరఁగవచ్చి నేరుపవయ్య చేఁతలు
యీవేళ నా కనరాదు యే నలమేల్‌మంగను
(॥॥)
మొక్కలపుటాసలతో మొగమెత్తి నిన్నుఁజూఁచి
చెక్కుచేతితో నింతి సిగ్గువడీని
మక్కువలు చల్లుకొంటా మాఁటలాడఁ బూఁచిపూఁచి
తొక్కుమెట్టుచెమటలఁదొప్పఁదోఁగీని
(॥॥)
జంటనిమ్మపండ్లు నీకు సతి గానుకియ్యవచ్చి
నంటుఁజన్నులు ఛూచుక నవ్వుకొనీని
ఇంటికి రమ్మని నిన్ను నిట్టె పిలువఁగవచ్చి
దంటతనముచాలక తలవంచీని
(॥॥)
గట్టిగా నీకాఁగిటఁగలయఁగఁ దమకించి
గుట్టుతోడ వలపుల గుబ్బతిలీని
యిట్టె శ్రీవేంకటేశ యిద్దరి మమ్ముఁగూడితివి
నిట్టూరుపులతో నాపె నివ్వెరగందీని
(||pallavi||)
nīvainām̐ jeram̐gavachchi nerubavayya sem̐talu
yīveḽa nā kanarādu ye nalamelmaṁganu
(||||)
mŏkkalabuḍāsalado mŏgamĕtti ninnum̐jūm̐si
sĕkkusedido niṁti sigguvaḍīni
makkuvalu sallugŏṁṭā mām̐ṭalāḍam̐ būm̐sibūm̐si
tŏkkumĕṭṭusĕmaḍalam̐dŏppam̐dom̐gīni
(||||)
jaṁṭanimmabaṁḍlu nīgu sadi gānugiyyavachchi
naṁṭum̐jannulu shūsuga navvugŏnīni
iṁṭigi rammani ninnu niṭṭĕ piluvam̐gavachchi
daṁṭadanamusālaga talavaṁchīni
(||||)
gaṭṭigā nīgām̐giḍam̐galayam̐gam̐ damagiṁchi
guṭṭudoḍa valabula gubbadilīni
yiṭṭĕ śhrīveṁkaḍeśha yiddari mammum̐gūḍidivi
niṭṭūrubulado nābĕ nivvĕragaṁdīni