నీవైనా నానతీవయ్యా నెరజాణవు
(॥పల్లవి॥)
నీవైనా నానతీవయ్యా నెరజాణవు
తావుల నీ దేవులైతే దాఁపిరము సేసెను
(॥॥)
పొలఁతి నీమాటలకు బొమ్మల జంకించి చూచి
తలవంచి సిగ్గుతోడఁ దడఁ బడీని
అలరి చెలికత్తెలు ఆరహస్య మడిగితే
తెలియఁజెప్పఁగరాక తెరవేసుకొనెను
(॥॥)
అప్పటి నీ సేఁతలకు నాయములు సోఁకనాడి
కప్పుకొన్నపయ్యదతో కాఁతాళించీని
వొప్పుగ నూడిగములవువిద లడిగితేను
ముప్పిరి నొడుగరాక ముసుఁగిడుకొనెను
(॥॥)
నీవు నవ్విననవ్వుకు నీతురుము వట్టి తీసి
వోవరిలోపలఁ గూడి వొగి మెచ్చీని
శ్రీ వేంకటేశ నీదేవు లలమేలుమంగ
వోవల నడిగితే నీవుర మెక్కుకొనెను
(||pallavi||)
nīvainā nānadīvayyā nĕrajāṇavu
tāvula nī devulaide dām̐piramu sesĕnu
(||||)
pŏlam̐ti nīmāḍalagu bŏmmala jaṁkiṁchi sūsi
talavaṁchi siggudoḍam̐ daḍam̐ baḍīni
alari sĕligattĕlu ārahasya maḍigide
tĕliyam̐jĕppam̐garāga tĕravesugŏnĕnu
(||||)
appaḍi nī sem̐talagu nāyamulu som̐kanāḍi
kappugŏnnabayyadado kām̐tāḽiṁchīni
vŏppuga nūḍigamulavuvida laḍigidenu
muppiri nŏḍugarāga musum̐giḍugŏnĕnu
(||||)
nīvu navvinanavvugu nīdurumu vaṭṭi tīsi
vovarilobalam̐ gūḍi vŏgi mĕchchīni
śhrī veṁkaḍeśha nīdevu lalamelumaṁga
vovala naḍigide nīvura mĕkkugŏnĕnu