నీవైనా నానతీవయ్య నీకేల యింతేసి సిగ్గు
(॥పల్లవి॥)
నీవైనా నానతీవయ్య నీకేల యింతేసి సిగ్గు
భావించ నలవిగాదు పంత మదియేఁటిదో
(॥॥)
చేతిమీఁదఁ జేయివేసి చెలి నిన్ను మెచ్చిమెచ్చి
యేతులకు నవ్వు నవ్వె నేఁటికోకాని
దూతిక మొగము చూచి తోడనే సన్నలు సేసి
కాతరపుమాట లేమికారణాన నాడెనో
(॥॥)
గుబ్బలు నీమేన నూఁది కొసరి కొసరి ఇంతి
వుబ్బున మొక్కులు మొక్కీ నూహ యేఁటిదో
గబ్బియై ముంజేతిచిలుకతో నేకతము చెప్పి
అబ్బురాన నంది పండు అది యేఁటికిచ్చెనో
(॥॥)
వురముపైఁ గూచుండి వొగి నలమేలుమంగ
అరుదుగాఁ గానుకిచ్చె నదియేఁటికో
ఇరవై శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
సరిగా నేపని కాపె చవులు వుట్టించెనో
(||pallavi||)
nīvainā nānadīvayya nīgela yiṁtesi siggu
bhāviṁcha nalavigādu paṁta madiyem̐ṭido
(||||)
sedimīm̐dam̐ jeyivesi sĕli ninnu mĕchchimĕchchi
yedulagu navvu navvĕ nem̐ṭigogāni
dūdiga mŏgamu sūsi toḍane sannalu sesi
kādarabumāḍa lemigāraṇāna nāḍĕno
(||||)
gubbalu nīmena nūm̐di kŏsari kŏsari iṁti
vubbuna mŏkkulu mŏkkī nūha yem̐ṭido
gabbiyai muṁjedisilugado negadamu sĕppi
abburāna naṁdi paṁḍu adi yem̐ṭigichchĕno
(||||)
vuramubaim̐ gūsuṁḍi vŏgi nalamelumaṁga
arudugām̐ gānugichchĕ nadiyem̐ṭigo
iravai śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
sarigā nebani kābĕ savulu vuṭṭiṁchĕno