Neevaduvamtivaamdavaa nene kaaga

నీవటువంటివాఁడవా నేనే కాక
Language

(॥పల్లవి॥)
నీవటువంటివాఁడవా నేనే కాక
వేవేలకు నావలని వేగిరము గాక

(॥నీవ॥)
పిలిపించినవాఁడవు ప్రియమాడక మానేవా
కలఁగినట్టి నాతమకము గాక
వలచినవాఁడవు వద్దనుండక మానేవా
నిలువుమనేటి నానేరమింతే కాక

(॥నీవ॥)
కనుఁగొన్నవాఁడవు కాఁగిలించక మానేవా
చనవు మెరసిన నాచలము గాక
ననుపైనవాఁడవు నగక నీవు మానేవా
తనివోక కొసరే నాతప్పులింతే కాక

(॥నీవ॥)
సేస వెట్టినవాఁడవు చెనక నీవు మానేవా
గాసి నిన్నుఁ బెట్టిననాకడమే కాక
యీసుదీర శ్రీవేంకటేశ నన్నుఁగూడితివి
రాసికెక్క మెచ్చిన నారాజసము గాక

(||pallavi||)
nīvaḍuvaṁṭivām̐ḍavā nene kāga
vevelagu nāvalani vegiramu gāga

(||nīva||)
pilibiṁchinavām̐ḍavu priyamāḍaga mānevā
kalam̐ginaṭṭi nādamagamu gāga
valasinavām̐ḍavu vaddanuṁḍaga mānevā
niluvumaneḍi nāneramiṁte kāga

(||nīva||)
kanum̐gŏnnavām̐ḍavu kām̐giliṁchaga mānevā
sanavu mĕrasina nāsalamu gāga
nanubainavām̐ḍavu nagaga nīvu mānevā
tanivoga kŏsare nādappuliṁte kāga

(||nīva||)
sesa vĕṭṭinavām̐ḍavu sĕnaga nīvu mānevā
gāsi ninnum̐ bĕṭṭinanāgaḍame kāga
yīsudīra śhrīveṁkaḍeśha nannum̐gūḍidivi
rāsigĕkka mĕchchina nārājasamu gāga