Neevaarainavaari nemu gaaravimchavaddaa

నీవారైనవారి నేము గారవించవద్దా
Language

(॥పల్లవి॥)
నీవారైనవారి నేము గారవించవద్దా
యీరీతిఁ (యీ విధాన?)నే మోరిచినదింతా నీకే సెలవు

(॥నీవా॥)
ఇత్తల నీచెలులను యెట్టైనఁ బొగడేము నీ-
చిత్తము వచ్చితేఁజాలు చింతయేఁటికి
బత్తితో నాపెచేనిమ్మపండు కిందికి జారితే
యెత్తి నే మిచ్చితే నది హీనమూఁ గాదు

(॥నీవా॥)
మంతనాన నీదేవులమాటున బదికేము నీ-
పంతము వచ్చితేఁజాలు పదరనేలా
బంతి నాపె కెచ్చరిక పరాకులు చెప్పితేను
యెంతైనా మా కందువల్ల నెగ్గులూఁ గావు

(॥నీవా॥)
యీడ నీసతిసలిగె నిట్టె నిన్నుఁ గూడేము
వేడుక నీ కైతేఁజాలు వీఁగనేఁటికి
పాడితో నన్నేలితివి పక్కన శ్రీవేంకటేశ
ఆడ నాపెచెల్లెలనైనది వొచ్చెము గాదు

(||pallavi||)
nīvārainavāri nemu gāraviṁchavaddā
yīrīdim̐ (yī vidhāna?)ne morisinadiṁtā nīge sĕlavu

(||nīvā||)
ittala nīsĕlulanu yĕṭṭainam̐ bŏgaḍemu nī-
sittamu vachchidem̐jālu siṁtayem̐ṭigi
battido nābĕsenimmabaṁḍu kiṁdigi jāride
yĕtti ne michchide nadi hīnamūm̐ gādu

(||nīvā||)
maṁtanāna nīdevulamāḍuna badigemu nī-
paṁtamu vachchidem̐jālu padaranelā
baṁti nābĕ kĕchchariga parāgulu sĕppidenu
yĕṁtainā mā kaṁduvalla nĕggulūm̐ gāvu

(||nīvā||)
yīḍa nīsadisaligĕ niṭṭĕ ninnum̐ gūḍemu
veḍuga nī kaidem̐jālu vīm̐ganem̐ṭigi
pāḍido nannelidivi pakkana śhrīveṁkaḍeśha
āḍa nābĕsĕllĕlanainadi vŏchchĕmu gādu