Neevaadinade maada nem jesinade semta

నీవాడినదే మాట నేఁ జేసినదే చేఁత
Language

(॥పల్లవి॥)
నీవాడినదే మాట నేఁ జేసినదే చేఁత
యీ విధాన మనలోన యెరవులు గలవా

(॥నీవా॥)
చిత్తమెల్ల నీసోమ్ము సిగ్గులివి నాసొమ్ము
మత్తిలి పూవుటమ్ములు మరునిసొమ్ము
కొత్తగా నీవు నేను కుప్పలుసేసుకొంటిమి
యిత్తల నీకును నాకు హెచ్చుకుందులున్నవా

(॥నీవా॥)
మొక్కులెల్ల నీపాలు మోవినవ్వు నాపాలు
చిక్కి యెడమాటలు చెలులపాలు
తొక్క మెట్టుగాను మనము దొరయఁ బంచుకొంటిమి
కక్కసించి చూచితేను కడమలిందున్నవా

(॥నీవా॥)
వినయాలు నీచేతివి వేగిరాలు నాచేతివి
అనువైన యాసలు పాయముచేతివి
ఘనుఁడ శ్రీవెంకటేశ కలిసితిమింతలోనె
చనవుల రతులలో జంపులు మరున్నవా

(||pallavi||)
nīvāḍinade māḍa nem̐ jesinade sem̐ta
yī vidhāna manalona yĕravulu galavā

(||nīvā||)
sittamĕlla nīsommu siggulivi nāsŏmmu
mattili pūvuḍammulu marunisŏmmu
kŏttagā nīvu nenu kuppalusesugŏṁṭimi
yittala nīgunu nāgu hĕchchuguṁdulunnavā

(||nīvā||)
mŏkkulĕlla nībālu movinavvu nābālu
sikki yĕḍamāḍalu sĕlulabālu
tŏkka mĕṭṭugānu manamu dŏrayam̐ baṁchugŏṁṭimi
kakkasiṁchi sūsidenu kaḍamaliṁdunnavā

(||nīvā||)
vinayālu nīsedivi vegirālu nāsedivi
anuvaina yāsalu pāyamusedivi
ghanum̐ḍa śhrīvĕṁkaḍeśha kalisidimiṁtalonĕ
sanavula radulalo jaṁpulu marunnavā