నీవాడే సరసము నిన్ను నింతసేసెను
(॥పల్లవి॥)
నీవాడే సరసము నిన్ను నింతసేసెను
యీవేళ నలమేల్‌మంగ కియ్యవయ్య పంతము
(॥నీవా॥)
పొలతి నీకంపినపూవులచెండు దీసుక
చెలికత్తెనే వేసేవు చెలరేఁగి
కలికి దవ్వులనుండి కంటినంటా నిమ్మపంట
కొలువులోననే నీకొప్పుదాఁక వేసెను
(॥నీవా॥)
వీడెము నీకంపితేను వేచమే కైకోని యాపె-
వూడిగపుసతి నొర నొగి నించఁగా
ఆడనే వుండి నీదేవు లందుకుఁ దనపుక్కిటి -
వీడెము నీకొంగున వెస మూట గట్టెను
(॥నీవా॥)
కాతరాన నీవంపినకానికపంచదార
దూతికకుఁ జవిచూపి తోరలించఁగా
యీతల శ్రీవేంకటేశ ఇల్లాలు మోమితేనె
వాతెర నంటించి నిన్ను వలపించుకొనెను
(||pallavi||)
nīvāḍe sarasamu ninnu niṁtasesĕnu
yīveḽa nalamelmaṁga kiyyavayya paṁtamu
(||nīvā||)
pŏladi nīgaṁpinabūvulasĕṁḍu dīsuga
sĕligattĕne vesevu sĕlarem̐gi
kaligi davvulanuṁḍi kaṁṭinaṁṭā nimmabaṁṭa
kŏluvulonane nīgŏppudām̐ka vesĕnu
(||nīvā||)
vīḍĕmu nīgaṁpidenu vesame kaigoni yābĕ-
vūḍigabusadi nŏra nŏgi niṁcham̐gā
āḍane vuṁḍi nīdevu laṁdugum̐ danabukkiḍi -
vīḍĕmu nīgŏṁguna vĕsa mūḍa gaṭṭĕnu
(||nīvā||)
kādarāna nīvaṁpinagānigabaṁchadāra
dūdigagum̐ javisūbi toraliṁcham̐gā
yīdala śhrīveṁkaḍeśha illālu momidenĕ
vādĕra naṁṭiṁchi ninnu valabiṁchugŏnĕnu