Neevaabegu valasuda ne meṟamgamaa

నీవాపెకు వలచుట నే మెఱఁగమా
Language

(॥పల్లవి॥)
నీవాపెకు వలచుట నే మెఱఁగమా
కైవసమై యివీఁ గొన్ని గడించేము గాక

(॥నీవా॥)
వినుమని నీ కప్పడే విన్నవించనానేను
వనిత తానే యీడ నచ్చునని
నినుఁబాసి మరి యాకె నిమిష మెరువఁగద్దా
మనసెరిఁగియు గుట్టు మానవైతివి గాక

(॥నీవా॥)
హత్తి తారుకాణించనా ఆపె నీకు నేపొద్దూ
చిత్తమురా నూడిగాలు సేసునని
బత్తి నీపైఁ బెట్టినది పంతాలు నెరవునా
కొత్తరాజసము చూపి కొసరితివి గాక

(॥నీవా॥)
సరుస దిష్టము చూపి సొకిరివెట్టనా నీకు
బెరసి నిన్నిట్టె యీకె పెండ్లాడునని
ఇరవై శ్రీవేంకటేశ యేలితి విఁకఁ గొంకునా
సొరిది నాపె నేరుపు చూచితివి గాక

(||pallavi||)
nīvābĕgu valasuḍa ne mĕṟam̐gamā
kaivasamai yivīm̐ gŏnni gaḍiṁchemu gāga

(||nīvā||)
vinumani nī kappaḍe vinnaviṁchanānenu
vanida tāne yīḍa nachchunani
ninum̐bāsi mari yāgĕ nimiṣha mĕruvam̐gaddā
manasĕrim̐giyu guṭṭu mānavaidivi gāga

(||nīvā||)
hatti tārugāṇiṁchanā ābĕ nīgu nebŏddū
sittamurā nūḍigālu sesunani
batti nībaim̐ bĕṭṭinadi paṁtālu nĕravunā
kŏttarājasamu sūbi kŏsaridivi gāga

(||nīvā||)
sarusa diṣhṭamu sūbi sŏgirivĕṭṭanā nīgu
bĕrasi ninniṭṭĕ yīgĕ pĕṁḍlāḍunani
iravai śhrīveṁkaḍeśha yelidi vim̐kam̐ gŏṁkunā
sŏridi nābĕ nerubu sūsidivi gāga