Neesittamu vachchinattu ne melamgedaanam gaaga

నీచిత్తము వచ్చినట్టు నే మెలంగేదానఁ గాక
Language

(॥పల్లవి॥)
నీచిత్తము వచ్చినట్టు నే మెలంగేదానఁ గాక
నాచలమే నెంచితేను నగవా నీవు

(॥॥)
వేసారక నే నీతో వేమారు విన్నవించఁగ
ఆసోదపుఁగత్తె యని ఆడవా నీవు
వాసుల కిందరివలె వంతులకుఁ బెనఁగితే
యీసరి వారిలో నన్ను నెంచవా నీవు

(॥॥)
కొత్తలుగా నే నిన్నుఁ గోరి కొంగువట్టితేను
చిత్తిణిది యని కాకుసేయవా నీవు
వొత్తి చెలులచే నిన్ను నొడఁబరపించి తేను
తత్తరపు గుణమని తలఁచవా నీవు

(॥॥)
తెరవేసి నీమోవితీపులు నేనడిగితే
బెరసి నామేలు రట్టుపెట్టివా నీవు
నిరతి శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గూడితివి
సరి దూఁగకుండితేను సాదించవా నీవు

(||pallavi||)
nīsittamu vachchinaṭṭu ne mĕlaṁgedānam̐ gāga
nāsalame nĕṁchidenu nagavā nīvu

(||||)
vesāraga ne nīdo vemāru vinnaviṁcham̐ga
āsodabum̐gattĕ yani āḍavā nīvu
vāsula kiṁdarivalĕ vaṁtulagum̐ bĕnam̐gide
yīsari vārilo nannu nĕṁchavā nīvu

(||||)
kŏttalugā ne ninnum̐ gori kŏṁguvaṭṭidenu
sittiṇidi yani kāguseyavā nīvu
vŏtti sĕlulase ninnu nŏḍam̐barabiṁchi tenu
tattarabu guṇamani talam̐savā nīvu

(||||)
tĕravesi nīmovidībulu nenaḍigide
bĕrasi nāmelu raṭṭubĕṭṭivā nīvu
niradi śhrīveṁkaḍeśha nīvĕ nannum̐ gūḍidivi
sari dūm̐gaguṁḍidenu sādiṁchavā nīvu