Neesittamu naabhaagyamu ne nemtadivaamdanu

నీచిత్తము నాభాగ్యము నే నెంతటివాఁడను
Language

(॥పల్లవి॥)
నీచిత్తము నాభాగ్యము నే నెంతటివాఁడను
యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే

(॥నీచి॥)
పాటించి నీభావము పట్టవశమా తలఁచి
మేటి నామనసు నీకు మీఁదెత్తు టింతే
నూటికైన నీనామము నుడుగఁగ వశమా
మాటలు నీసెలవుగా నుట్టుపెట్టుటింతే

(॥నీచి॥)
వేవేలైన నీకథలు వినఁగ నాతరమా
సోవగా వీనులు తావు చూపుట యింతే
దేవ నీసాకారము ద్రిష్టించ నావశమా
పావనముగా నందులోఁ బనిగొను టింతే

(॥నీచి॥)
గట్టిగా నిన్నుఁ బూజించఁ గమ్మటి నావశమా
నెట్టిన నామేను నీకు నేమించు టింతే
పట్టపలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
జట్టిగొనుకొరకు నీశరణను టింతే

(||pallavi||)
nīsittamu nābhāgyamu ne nĕṁtaḍivām̐ḍanu
yesi nīvu rakṣhiṁchede yĕkkuḍubuṇya miṁte

(||nīsi||)
pāḍiṁchi nībhāvamu paṭṭavaśhamā talam̐si
meḍi nāmanasu nīgu mīm̐dĕttu ṭiṁte
nūḍigaina nīnāmamu nuḍugam̐ga vaśhamā
māḍalu nīsĕlavugā nuṭṭubĕṭṭuḍiṁte

(||nīsi||)
vevelaina nīgathalu vinam̐ga nādaramā
sovagā vīnulu tāvu sūbuḍa yiṁte
deva nīsāgāramu driṣhṭiṁcha nāvaśhamā
pāvanamugā naṁdulom̐ banigŏnu ṭiṁte

(||nīsi||)
gaṭṭigā ninnum̐ būjiṁcham̐ gammaḍi nāvaśhamā
nĕṭṭina nāmenu nīgu nemiṁchu ṭiṁte
paṭṭabalamelmaṁgabadivi śhrīveṁkaḍeśha
jaṭṭigŏnugŏragu nīśharaṇanu ṭiṁte