Neesitta mettunnado ne neṟamganu

నీచిత్త మెట్టున్నదో నే నెఱఁగను
Language

(॥పల్లవి॥)
నీచిత్త మెట్టున్నదో నే నెఱఁగను
చేచేత నెప్పుడూ నీసేవ సేసేదానను

(॥నీచి॥)
పెక్కుమాట లాడితేను పెనుగయ్యాళి యందువో
గక్కన నూరకుండితే గర్వినందువొ
నిక్కిచూచితే నెంత నీటుచూపీ నందువో
గుక్కొని నాలో నేనే గుట్టుతో నుందానను

(॥నీచి॥)
ఇంతలొ నీకు మొక్కితే నేమిగోరి నందువొ
మంతనానకు వచ్చితే మరేమందువో
చెంతనుండి వచ్చితేను చిత్తిణి ఇదెందువో
యింతేసి కోపక నాయిచ్చనే వుందానను

(॥నీచి॥)
కడుబత్తిసేయఁగాను కతకారి యందువో
విడెము నిన్నడుగఁగా వేసాలందుపో
యేడనేడ శ్రీవేంకటేశ నను నేలితివి
వొడఁబడి నీరతుల నొద్దికై వుందానను

(||pallavi||)
nīsitta mĕṭṭunnado ne nĕṟam̐ganu
seseda nĕppuḍū nīseva sesedānanu

(||nīsi||)
pĕkkumāḍa lāḍidenu pĕnugayyāḽi yaṁduvo
gakkana nūraguṁḍide garvinaṁduvŏ
nikkisūside nĕṁta nīḍusūbī naṁduvo
gukkŏni nālo nene guṭṭudo nuṁdānanu

(||nīsi||)
iṁtalŏ nīgu mŏkkide nemigori naṁduvŏ
maṁtanānagu vachchide maremaṁduvo
sĕṁtanuṁḍi vachchidenu sittiṇi idĕṁduvo
yiṁtesi kobaga nāyichchane vuṁdānanu

(||nīsi||)
kaḍubattiseyam̐gānu kadagāri yaṁduvo
viḍĕmu ninnaḍugam̐gā vesālaṁdubo
yeḍaneḍa śhrīveṁkaḍeśha nanu nelidivi
vŏḍam̐baḍi nīradula nŏddigai vuṁdānanu