Neeseyi meemdaaya nee kemayya

నీచేయి మీఁదాయ నీ కేమయ్య
Language

(॥పల్లవి॥)
నీచేయి మీఁదాయ నీ కేమయ్య
నా చేతిచెక్కుతో నాకే నవ్వు నవ్వవలసె

(॥నీచే॥)
నీవల్లఁ గడమేది నిన్ను నమ్మఁజాలని
నావొళ్లి నేరమే నాది గాక
కావరించేనన్ను నీవు గక్కున మన్నించఁగాను
చేవదేరి నాకు నాకే సిగ్గువడ వలసె

(॥నీచే॥)
నీతగవు దప్పునా నిన్నుఁదెలియఁగ లేక
కాతరించినదె నాకల్లగాక
యీతలనటువంటి నన్నిట్టె నీవాదరించఁగా
రాతిరినుంటిందుకే కరఁగ నాకు వలసె

(॥నీచే॥)
నీగుణ మటువంటిదా నిన్ను మెచ్చకుండినయీ-
యాగడవు నాకోపమే యాఱడి గాక
యీగతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
భోగపు నీరతులకే పొందు సేయవలసె

(||pallavi||)
nīseyi mīm̐dāya nī kemayya
nā sedisĕkkudo nāge navvu navvavalasĕ

(||nīse||)
nīvallam̐ gaḍamedi ninnu nammam̐jālani
nāvŏḽli nerame nādi gāga
kāvariṁchenannu nīvu gakkuna manniṁcham̐gānu
sevaderi nāgu nāge sigguvaḍa valasĕ

(||nīse||)
nīdagavu dappunā ninnum̐dĕliyam̐ga lega
kādariṁchinadĕ nāgallagāga
yīdalanaḍuvaṁṭi nanniṭṭĕ nīvādariṁcham̐gā
rādirinuṁṭiṁduge karam̐ga nāgu valasĕ

(||nīse||)
nīguṇa maḍuvaṁṭidā ninnu mĕchchaguṁḍinayī-
yāgaḍavu nāgobame yāṟaḍi gāga
yīgadi śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
bhogabu nīradulage pŏṁdu seyavalasĕ