Neesedanaune nerbulivi yellaanu

నీచేతనౌనె నేర్పులివి యెల్లాను
Language

(॥పల్లవి॥)
నీచేతనౌనె నేర్పులివి యెల్లాను
కాచుకుండి మనసెల్లఁ గరఁగించఁగలవె

(॥॥)
కడువలచితినంటా కాంతుని కిచ్చకమాడి
తొడిఁబడఁ గాఁగిలించి దొమ్మిసేసేవు
అడరి చొక్కులఁబెట్టి అంతసేసినదానవు
బడిఁ దిప్పి యాతని భ్రమయించఁగలవే

(॥॥)
పాసియుండ నోపనంటా పక్కననుబ్బించి పతి-
కాసచూపి ఇంటఁబెట్టు కలయించేవు
బేసబెల్లివై ఇట్లాఁ బెడరేఁచినదానవు
బాససేయించు కేపొద్దూఁ బనిగొనఁగలవే

(॥॥)
పట్టపుదేవులనంటా పైకొని శ్రీవేంకటేశు-
నట్టు నిట్టుఁ గూడితివి అలమేల్మంగా
గుట్టున నన్నితఁడేలెఁ గుచ్చితపుదానవు
వొట్టుక వురముమీఁద నుండఁగఁగలవే

(||pallavi||)
nīsedanaunĕ nerbulivi yĕllānu
kāsuguṁḍi manasĕllam̐ garam̐giṁcham̐galavĕ

(||||)
kaḍuvalasidinaṁṭā kāṁtuni kichchagamāḍi
tŏḍim̐baḍam̐ gām̐giliṁchi dŏmmisesevu
aḍari sŏkkulam̐bĕṭṭi aṁtasesinadānavu
baḍim̐ dippi yādani bhramayiṁcham̐galave

(||||)
pāsiyuṁḍa nobanaṁṭā pakkananubbiṁchi padi-
kāsasūbi iṁṭam̐bĕṭṭu kalayiṁchevu
besabĕllivai iṭlām̐ bĕḍarem̐sinadānavu
bāsaseyiṁchu kebŏddūm̐ banigŏnam̐galave

(||||)
paṭṭabudevulanaṁṭā paigŏni śhrīveṁkaḍeśhu-
naṭṭu niṭṭum̐ gūḍidivi alamelmaṁgā
guṭṭuna nannidam̐ḍelĕm̐ guchchidabudānavu
vŏṭṭuga vuramumīm̐da nuṁḍam̐gam̐galave