నీరువట్టుక నేయి వోయనేరనే నేను
(॥పల్లవి॥)
నీరువట్టుక నేయి వోయనేరనే నేను
సారె నా వలపునీరు చల్లుటింతే కాని
(॥॥)
ఇట్టె నాలుకలోన బెల్లాలు యెదలోనఁ గత్తులు
నెట్టుకొని నీవెల నేరనే నేను
వట్టిమాటలిగిరించ వంచితేఁ దేనెలుగార
గట్టిగా నాపెదవులఁ గలదింతేకాని
(॥॥)
కని యింటికాడ గానుగకాడా గసి
నినుఁజూచి నేరుచుకొనేరనే నేను
మనసు గరఁగించేది మర్మము భేదించేది
కనుచూపులు నాయందుఁగల దింతేకాని
(॥॥)
అమ్మేది వొకటి అసిమలో దొకటి
నెమ్మది నీయంతేసి నేరనే నేను
కమ్మి శ్రీ వేంకటపతిఁ గలసితి వెలసితి
కమ్మరఁ గమ్మర నిదే కలదింతేకాని
(||pallavi||)
nīruvaṭṭuga neyi voyanerane nenu
sārĕ nā valabunīru salluḍiṁte kāni
(||||)
iṭṭĕ nālugalona bĕllālu yĕdalonam̐ gattulu
nĕṭṭugŏni nīvĕla nerane nenu
vaṭṭimāḍaligiriṁcha vaṁchidem̐ denĕlugāra
gaṭṭigā nābĕdavulam̐ galadiṁtegāni
(||||)
kani yiṁṭigāḍa gānugagāḍā gasi
ninum̐jūsi nerusugŏnerane nenu
manasu garam̐giṁchedi marmamu bhediṁchedi
kanusūbulu nāyaṁdum̐gala diṁtegāni
(||||)
ammedi vŏgaḍi asimalo dŏgaḍi
nĕmmadi nīyaṁtesi nerane nenu
kammi śhrī veṁkaḍabadim̐ galasidi vĕlasidi
kammaram̐ gammara nide kaladiṁtegāni