నీరువట్టు గొన్నవేళ నేయి మందవునా
(॥పల్లవి॥)
నీరువట్టు గొన్నవేళ నేయి మందవునా
కూరిమి మమ్మిద్దరినిఁ గూరుచరే చెలులు
(॥నీరు॥)
నెలఁతచెక్కులే నాకు నిలువుటద్దములు
అలరులతావివూర్పు లాలవట్టాలు
నెలవులనగవులే చేతికిచ్చేకప్పురాలు
చలిమందు లిఁక నన్నీఁజాలునే నాకు
(॥నీరు॥)
వనితమాటలే నాకు వలరాచమంత్రాలు
నినుపుఁజెమటలే పన్నీటిసోనలు
ఘనమైనసరసాలే గందపుఁగస్తూరిఁపూఁత
యెనలేని వుపచారా లివియేలే నాకు
(॥నీరు॥)
సతితోడిపానుపే చంద్రకాంతపువేది
యితవుగఁ గూడించితి రిందరూ మమ్ము
రతుల శ్రీవేంకటాద్రిరాయఁడ నే నిదివో
మితిమీర నూఁచకురే మేలాయఁ బనులు
(||pallavi||)
nīruvaṭṭu gŏnnaveḽa neyi maṁdavunā
kūrimi mammiddarinim̐ gūrusare sĕlulu
(||nīru||)
nĕlam̐tasĕkkule nāgu niluvuḍaddamulu
alaruladāvivūrbu lālavaṭṭālu
nĕlavulanagavule sedigichchegappurālu
salimaṁdu lim̐ka nannīm̐jālune nāgu
(||nīru||)
vanidamāḍale nāgu valarāsamaṁtrālu
ninubum̐jĕmaḍale pannīḍisonalu
ghanamainasarasāle gaṁdabum̐gastūrim̐pūm̐ta
yĕnaleni vubasārā liviyele nāgu
(||nīru||)
sadidoḍibānube saṁdragāṁtabuvedi
yidavugam̐ gūḍiṁchidi riṁdarū mammu
radula śhrīveṁkaḍādrirāyam̐ḍa ne nidivo
midimīra nūm̐sagure melāyam̐ banulu