Neeru vattugonnasoda neyi mamdugaa debudu

నీరు వట్టుగొన్నచోట నేయి మందుగా దెపుడు
Language

(॥పల్లవి॥)
నీరు వట్టుగొన్నచోట నేయి మందుగా దెపుడు
నేరుచుక వత్తుగాని నీవు వోయిరారా

(॥నీరు॥)
ఆడినట్టుండదు మాఁట అవురా మీఁదటికి
పాడి విచారించుకొనేఁ బట్టకుండరా
వేడుకకానికి మరి వెసలఁ బెట్టుమనక
వీడనే వగరించేవు నీవు వోఇరారా

(॥నీరు॥)
చెప్పినటువలె రాదు చేచేతఁ గాలము
దప్పిగొంటి నీకతలఁ దలరా నీవు
వుప్పు గప్పురముతోడ నొక్కసరి సేయక
నిప్పు చెదలంటీనా నీవు వోయిరారా

(॥నీరు॥)
రాజవైన యట్టుండదు రతికేళి సేయువేళ
వోజతో నే నియ్యకొంటి నోపననకు
తేజపు శ్రీవేంకటేశ తెలిసి కూడితి నన్ను
నీజాడలెల్లాఁ గంటి నీవు వోయిరారా

(||pallavi||)
nīru vaṭṭugŏnnasoḍa neyi maṁdugā dĕbuḍu
nerusuga vattugāni nīvu voyirārā

(||nīru||)
āḍinaṭṭuṁḍadu mām̐ṭa avurā mīm̐daḍigi
pāḍi visāriṁchugŏnem̐ baṭṭaguṁḍarā
veḍugagānigi mari vĕsalam̐ bĕṭṭumanaga
vīḍane vagariṁchevu nīvu voirārā

(||nīru||)
sĕppinaḍuvalĕ rādu sesedam̐ gālamu
dappigŏṁṭi nīgadalam̐ dalarā nīvu
vuppu gappuramudoḍa nŏkkasari seyaga
nippu sĕdalaṁṭīnā nīvu voyirārā

(||nīru||)
rājavaina yaṭṭuṁḍadu radigeḽi seyuveḽa
vojado ne niyyagŏṁṭi nobananagu
tejabu śhrīveṁkaḍeśha tĕlisi kūḍidi nannu
nījāḍalĕllām̐ gaṁṭi nīvu voyirārā