Neeru vattugonnasoda nedam deerunaa

నీరు వట్టుగొన్నచోట నేతఁ దీరునా
Language

(॥పల్లవి॥)
నీరు వట్టుగొన్నచోట నేతఁ దీరునా
సారె నాతని పొందులే చలిమందులు నాకూ

(॥॥)
కప్పి యాతఁడు నవ్వితేఁ గాఁకలు మానీఁగాక
కప్పుర మేల చల్లేరే కాంతలాల
తప్ప కాతని మోవినే దప్పులు దేరీఁ గాక
యిప్పుడింత పన్నీరు ఇచ్చిరే నాకూ

(॥॥)
పొరిఁ బొరి నాతని వూర్పులఁ జెమ టారీఁ గాక
సురటేల విసరేరే సుదతులాలా
సరి నాతని మేలమే విరహ మార్చీఁ గాక
విరు లేల పోసేరే వేమారు నాపైని

(॥॥)
సొగి సాతని పాదాలు సోఁకి చల్లనయ్యీఁ గాక
చిగు రేల పరచేరే చెలియలాల
నిగిడి శ్రీ వేంకట నిలయుఁడు నన్నుఁగూడె
జిగి వట్టి కత లేల చెప్పేరే యింకాను

(||pallavi||)
nīru vaṭṭugŏnnasoḍa nedam̐ dīrunā
sārĕ nādani pŏṁdule salimaṁdulu nāgū

(||||)
kappi yādam̐ḍu navvidem̐ gām̐kalu mānīm̐gāga
kappura mela sallere kāṁtalāla
tappa kādani movine dappulu derīm̐ gāga
yippuḍiṁta pannīru ichchire nāgū

(||||)
pŏrim̐ bŏri nādani vūrbulam̐ jĕma ṭārīm̐ gāga
suraḍela visarere sudadulālā
sari nādani melame viraha mārsīm̐ gāga
viru lela posere vemāru nābaini

(||||)
sŏgi sādani pādālu som̐ki sallanayyīm̐ gāga
sigu rela parasere sĕliyalāla
nigiḍi śhrī veṁkaḍa nilayum̐ḍu nannum̐gūḍĕ
jigi vaṭṭi kada lela sĕppere yiṁkānu