నీరు కొలఁది తామెర నేరిచితేను వలపు
(॥పల్లవి॥)
నీరు కొలఁది తామెర నేరిచితేను వలపు
యీరీతి విన్నవించరే యింతులాల పతికీ
(॥॥)
యెగసక్కెపు వారి నేమీ ననరాదు గాని
నగిన వారి తోడ నగవచ్చును
బిగియఁగా సారె సారెఁ బెనగఁగ రాదు గాని
మొగము చూచేనంటే మోము చూప వచ్చును
(॥॥)
చాయపాటు పొందులకు సమ్మతించరాదు గాని
సేయించుకొంటేఁ బనులు సేయవచ్చును
నాయము చెప్ప వచ్చితే నమ్మఁగరాదు గాని
ఆయము లంటితేను అంటుకొనవచ్చును
(॥॥)
యేడ కేడో కతలకు నియ్యకొనరాదు గాని
కూడితేను కౌఁగిటఁ గూడవచ్చును
యీడు జోడై శ్రీ వేంకటేశుఁడిట్టే నన్నుఁ గూడె
వేడుకైతే నిద్దరికి వేడుకలే వచ్చునూ
(||pallavi||)
nīru kŏlam̐di tāmĕra nerisidenu valabu
yīrīdi vinnaviṁchare yiṁtulāla padigī
(||||)
yĕgasakkĕbu vāri nemī nanarādu gāni
nagina vāri toḍa nagavachchunu
bigiyam̐gā sārĕ sārĕm̐ bĕnagam̐ga rādu gāni
mŏgamu sūsenaṁṭe momu sūba vachchunu
(||||)
sāyabāḍu pŏṁdulagu sammadiṁcharādu gāni
seyiṁchugŏṁṭem̐ banulu seyavachchunu
nāyamu sĕppa vachchide nammam̐garādu gāni
āyamu laṁṭidenu aṁṭugŏnavachchunu
(||||)
yeḍa keḍo kadalagu niyyagŏnarādu gāni
kūḍidenu kaum̐giḍam̐ gūḍavachchunu
yīḍu joḍai śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe nannum̐ gūḍĕ
veḍugaide niddarigi veḍugale vachchunū