Neeru kolamdi taamara needo valabu

నీరు కొలఁది తామర నీతో వలపు
Language

(॥పల్లవి॥)
నీరు కొలఁది తామర నీతో వలపు
నేరిచినవారికి నిండునిధానమవు

(॥నీరు॥)
హత్తి నీకు నేపొద్దు నండనుండి సేవసేసి
చిత్తము రా మెలఁగేదే చెలియ
కొత్తకొత్తరతులను కోరి నిన్నుఁ గరఁగించి
బత్తిసేసితే నీవూఁ బాయక వుండుదువు

(॥నీరు॥)
కచ్చుపెట్టుకోని వేళగాచుక నీతోడుత
యిచ్చకములాడినదే ఇంతి
నిచ్చనవిడివి నీవేడుకవినయముల
మెచ్చఁగూడితే నీవు మేలువాఁడ వౌదువు

(॥నీరు॥)
కలికితనాల నిన్నుఁ గాఁగిలించి నేరువులు
తలఁపించుక నవ్విందే తరుణి
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
లలి నావలె నుండితె లాలించి రక్షింతువు

(||pallavi||)
nīru kŏlam̐di tāmara nīdo valabu
nerisinavārigi niṁḍunidhānamavu

(||nīru||)
hatti nīgu nebŏddu naṁḍanuṁḍi sevasesi
sittamu rā mĕlam̐gede sĕliya
kŏttagŏttaradulanu kori ninnum̐ garam̐giṁchi
battiseside nīvūm̐ bāyaga vuṁḍuduvu

(||nīru||)
kachchubĕṭṭugoni veḽagāsuga nīdoḍuda
yichchagamulāḍinade iṁti
nichchanaviḍivi nīveḍugavinayamula
mĕchcham̐gūḍide nīvu meluvām̐ḍa vauduvu

(||nīru||)
kaligidanāla ninnum̐ gām̐giliṁchi neruvulu
talam̐piṁchuga navviṁde taruṇi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
lali nāvalĕ nuṁḍidĕ lāliṁchi rakṣhiṁtuvu