Neeneramulagu nenaa guri

నీనేరములకు నేనా గురి
Language

(॥పల్లవి॥)
నీనేరములకు నేనా గురి
నానఁబెట్టి కత నడపఁగరాదా

(॥నీనే॥)
మఱఁగుల మొఱఁగుల మాఁటలాడితే
మఱి కరఁగెను నీమన సిపుడు
యెఱఁగను నే నందుకేమి సేతురా
నెఱపునీబిగువు నిలుపఁగరాదా

(॥నీనే॥)
సేయరానిపని చేసి కడు వడిసె
కాయపుఁజెమటలు కడు వడిసె
రాయడించరా రతివేళ వెనక
తీయక ధైర్యము తెచ్చుకోరాదా

(॥నీనే॥)
అలమేల్ మంగ నే నటు నినుఁ గూడిన
పులకించె మొగము కళరేఁగి
సెలవి నవ్వరాదా శ్రీవేంకటేశ్వర
బలిమిఁ బరాకునఁబై కొనరాదా

(||pallavi||)
nīneramulagu nenā guri
nānam̐bĕṭṭi kada naḍabam̐garādā

(||nīne||)
maṟam̐gula mŏṟam̐gula mām̐ṭalāḍide
maṟi karam̐gĕnu nīmana sibuḍu
yĕṟam̐ganu ne naṁdugemi sedurā
nĕṟabunībiguvu nilubam̐garādā

(||nīne||)
seyarānibani sesi kaḍu vaḍisĕ
kāyabum̐jĕmaḍalu kaḍu vaḍisĕ
rāyaḍiṁcharā radiveḽa vĕnaga
tīyaga dhairyamu tĕchchugorādā

(||nīne||)
alamel maṁga ne naḍu ninum̐ gūḍina
pulagiṁchĕ mŏgamu kaḽarem̐gi
sĕlavi navvarādā śhrīveṁkaḍeśhvara
balimim̐ barāgunam̐bai kŏnarādā