Neemeemdi talabomtale nimduradigaa bhaavimchi

నీమీఁది తలపోఁతలే నిండురతిగా భావించి
Language

(॥పల్లవి॥)
నీమీఁది తలపోఁతలే నిండురతిగా భావించి
ప్రేమతోనున్నది యిట్టె ప్రియము చేకోవయ్యా

(॥నీమీ॥)
వీడెమిచ్చే యప్పటి వేడుకలు దలపోసి
ఆడుకోలుమాఁటలెల్ల నటుదలఁచి
కూడివున్నవేళల గురుతులు దలపోసి
వోడక సంతోసములనోలలాడుచున్నది

(॥నీమీ॥)
కేళాకూళిలో నీమేలములు దలపోసి
చేలకొంగువట్టిన సిగ్గు దలఁచి
సోలిఁ గొలు వున్నచోటి చూపులు దలపోసి
వోలి సంతోసములలో నోలలాడుచున్నది

(॥నీమీ॥)
ముప్పిరిగొనిన నీమోవితీపు దలపోసి
నెప్పున నీవు గూడిన నేర్పు దలఁచి
యిప్పుడు శ్రీ వెంకటేశ యీకె యలమేలుమంగ
వొప్పగు సంతోసాన నోలలాడుచున్నది

(||pallavi||)
nīmīm̐di talabom̐tale niṁḍuradigā bhāviṁchi
premadonunnadi yiṭṭĕ priyamu segovayyā

(||nīmī||)
vīḍĕmichche yappaḍi veḍugalu dalabosi
āḍugolumām̐ṭalĕlla naḍudalam̐si
kūḍivunnaveḽala gurudulu dalabosi
voḍaga saṁtosamulanolalāḍusunnadi

(||nīmī||)
keḽāgūḽilo nīmelamulu dalabosi
selagŏṁguvaṭṭina siggu dalam̐si
solim̐ gŏlu vunnasoḍi sūbulu dalabosi
voli saṁtosamulalo nolalāḍusunnadi

(||nīmī||)
muppirigŏnina nīmovidību dalabosi
nĕppuna nīvu gūḍina nerbu dalam̐si
yippuḍu śhrī vĕṁkaḍeśha yīgĕ yalamelumaṁga
vŏppagu saṁtosāna nolalāḍusunnadi