(॥పల్లవి॥)
నీలోనివారమే నేమెల్లాను
పాలువొంగినట్లనే బతుకవే యిఁకను
(॥నీలో॥)
నిలువెల్ల నీటే నీకేమి గడమే
వలపించితివి యిందువంక నాతని
చలవాసితి వన్నిటా సతమాయ నాతఁడు
ఫలియించె నీతపము బతుకవే యిఁకను
(॥నీలో॥)
మేనెల్ల గర్వమే మేకులు నీకేమి బాఁతె
లోను సేసుకొంటివి మేలున నాతని
యీనెపాన దొరవైతి వింతసేసె నాతఁడు
పానినచలము చెల్లె బతుకవే యిఁకను
(॥నీలో ॥)
రూపెల్ల బిగువే నేరుపులు నీకేమి గొత్తె
తీపులఁబెట్టితివి యింతేసి యాతని
చేపట్టి నిన్నిట్టె కూడె శ్రీవేంకటేశుఁడు
పైపైనె మావలెనే బతుకవే యిఁకను
(||pallavi||)
nīlonivārame nemĕllānu
pāluvŏṁginaṭlane badugave yim̐kanu
(||nīlo||)
niluvĕlla nīḍe nīgemi gaḍame
valabiṁchidivi yiṁduvaṁka nādani
salavāsidi vanniḍā sadamāya nādam̐ḍu
phaliyiṁchĕ nīdabamu badugave yim̐kanu
(||nīlo||)
menĕlla garvame megulu nīgemi bām̐tĕ
lonu sesugŏṁṭivi meluna nādani
yīnĕbāna dŏravaidi viṁtasesĕ nādam̐ḍu
pāninasalamu sĕllĕ badugave yim̐kanu
(||nīlo ||)
rūbĕlla biguve nerubulu nīgemi gŏttĕ
tībulam̐bĕṭṭidivi yiṁtesi yādani
sebaṭṭi ninniṭṭĕ kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
paibainĕ māvalĕne badugave yim̐kanu