(॥పల్లవి॥)
నీలొని మతకాలు నే నెఱఁగనా
పోలించి సరి వచ్చితే బొంకఁ జోట్లేవి
(॥నీలొని॥)
సొలవక మగవాఁడు చూచిన యంతటిలోనె
తలంపు దెలియనిది తరుణా యది
పలికినంతటిలోనె భావము దెలియకున్న
నెలకొన్న యాఁటదాని నేరు పెల్లా నేది
(॥నీలొని॥)
యెదెట నిలిచితేనే యింగితాకారము లెల్ల
తుద నేర్పరచనిది తొయ్యలా యది
కదిసే యాసంది లోనే కలయించెఱగకున్న
దరాన మానినుల జాణతన మేది
(॥నీలొని॥)
చేముట్టి నంతటిలోనే శ్రీవేంకటేశ్వరుఁడ
నీ మనసు గనకున్న నెలతా యది
కామించి కూడితివి యీకందు విట్టిదనకున్న
వేమరు మావంటి వారివివేక మేది
(||pallavi||)
nīlŏni madagālu ne nĕṟam̐ganā
poliṁchi sari vachchide bŏṁkam̐ joṭlevi
(||nīlŏni||)
sŏlavaga magavām̐ḍu sūsina yaṁtaḍilonĕ
talaṁpu dĕliyanidi taruṇā yadi
paliginaṁtaḍilonĕ bhāvamu dĕliyagunna
nĕlagŏnna yām̐ṭadāni neru pĕllā nedi
(||nīlŏni||)
yĕdĕḍa nilisidene yiṁgidāgāramu lĕlla
tuda nerbarasanidi tŏyyalā yadi
kadise yāsaṁdi lone kalayiṁchĕṟagagunna
darāna māninula jāṇadana medi
(||nīlŏni||)
semuṭṭi naṁtaḍilone śhrīveṁkaḍeśhvarum̐ḍa
nī manasu ganagunna nĕladā yadi
kāmiṁchi kūḍidivi yīgaṁdu viṭṭidanagunna
vemaru māvaṁṭi vārivivega medi