నీళ్లడిచితే నేఁడేల రెండయీ(య్యి?)
(॥పల్లవి॥)
నీళ్లడిచితే నేఁడేల రెండయీ(య్యి?)
నోళ్లు మాలోనే నొడిగితిమి
(॥నీళ్ల॥)
దాపగుమేనేలే దవ్వుల నున్నవి
చూపు లొండొరుల సోఁకినవి
మాపుదాఁకా నేము మాటల నెడాడి
పైపై నూరకె బడలితిమి
(॥నీళ్ల॥)
పెనఁగేవంతాలే బిగిసివున్నవి
మనసులు రెండు మాఁగినవి
పనిమాలి నేమే బాసలుసేయుచు
తనివోక తిట్టే దప్పిగొంటిమి
(॥నీళ్ల॥)
కందున మోహాలే కాఁగిళ్ల నున్నవి
అంది మోవికెంపు లంటినవి
యెందును మీగుట్టు యెఱఁగమైతిమి
చెందితివి చెలి శ్రీవేంకటేశా
(||pallavi||)
nīḽlaḍiside nem̐ḍela rĕṁḍayī(yyi?)
noḽlu mālone nŏḍigidimi
(||nīḽla||)
dābagumenele davvula nunnavi
sūbu lŏṁḍŏrula som̐kinavi
mābudām̐kā nemu māḍala nĕḍāḍi
paibai nūragĕ baḍalidimi
(||nīḽla||)
pĕnam̐gevaṁtāle bigisivunnavi
manasulu rĕṁḍu mām̐ginavi
panimāli neme bāsaluseyusu
tanivoga tiṭṭe dappigŏṁṭimi
(||nīḽla||)
kaṁduna mohāle kām̐giḽla nunnavi
aṁdi movigĕṁpu laṁṭinavi
yĕṁdunu mīguṭṭu yĕṟam̐gamaidimi
sĕṁdidivi sĕli śhrīveṁkaḍeśhā